Sunday, June 20, 2010

ఫాదర్స్‌ డే , Father's Day





జూన్ మూడో ఆదివారము
పండగలు , వ్రతాలు , నోములు , ఉత్సవాలు , పూజలు జరుపుకోవడం ప్రతి మతం సంస్కృతి లోను ఉన్నది . గతాన్ని గుర్తుచేసుకోవడం , పూర్వికుల సాంస్క్రుత ,సాంప్రదాయాలను కాలక్రమేన మరుగునపడిపోకుండా ఉండేందుకు ఈ ఉత్సవాలన్నీ దోహదపడతాయి . గతాన్ని చదివి ... బవిష్యత్తును మెరుగురుపరచుకునేందుకు మార్గము ఏర్పడుతుంది . సంవత్సరములో తక్కువ పందుగలు ఉన్న మతము లోగాని , దేశం లోగాని " డే- సెలబ్రేషన్స్ " రూపములో ఉత్సవాలను జరుపుకుంతారు . సమాజానికి ఒక మంచి సందేశాన్ని , మార్గాన్ని ఇస్తాయి ఈ దినోత్సవాలు .

అసలు, ఇలా వచ్చే రోజుల ప్రాముఖ్యతకి అంతేలేదు. 'టీచర్స్‌డే', 'బాస్‌ డే', 'డాక్టర్స్‌ డే', 'డైవోర్స్‌ డే'. 'సెక్రెటరీ డే', 'వాలంటైన్‌ డే', 'మదర్స్‌ డే', 'ఫాదర్స్‌ డే', 'బర్త్‌ డే', 'బ్రదర్స్‌ డే', 'ఫ్రెండ్స్‌డే', మార్టిర్స్‌ డే, రిపబ్లిక్‌ డే, 'ఇండిపెండెన్స్‌ డే', 'యుఎన్‌ఓ డే'- ఇలా, ఏడాదిలోని, 365 రోజులకీ, లీప్‌ ఇయర్‌లోని 366 దినాలకీ సరిపడిన దినోత్సవాలు ఉన్నాయి .


ఈరోజు ఫాదర్స్‌ డే. ''హ్యాపీ ఫాదర్స్‌ డే'' అంటూ బిగ్గరగా అభినందనలు తెలియజేద్దాం. జన్మనిచ్చిన తండ్రికి వందనాలు సమర్పిద్దాం. మన ఉనికి, ఉన్నతి అన్నీ అమ్మానాన్నల చలవే కదా! అమ్మంటే... తొమ్మిది నెలలు మోసి, ప్రసవవేదనతో చావును ఛాలెంజ్‌ చేస్తూ బిడ్డకు జన్మనివ్వడం ఒక ఎత్తయితే, ఆ బిడ్డకు సకల సేవలూ చేయడం మరో ఎత్తు. తనను తాను మర్చిపోయి ఎలాంటి త్యాగానికయినా వెనకాడని మాతృమూర్తికి వేరెవరూ సాటి రారనుకోండి. అయితే ఆవిడ తర్వాతి స్థానం మాత్రం ఖచ్చితంగా తండ్రిదే. అవును, అమ్మను ఒకనిమిషం పక్కన పెడితే అంత చిక్కనైన, చక్కనైన మరో అనుబంధం నాన్నది. అమ్మ మమకారం అందిస్తే నాన్న నడక, నడత నేర్పిస్తాడు. లోకంలో ఉన్న పలుకాకుల్ని చూపిస్తాడు. ఎలాంటి కష్టమెదురైనా, క్లిష్టమైన సమస్యలు చుట్టుముట్టినా, డీలా పడకుండా ఢీకొనేందుకు అవసరమైన తర్ఫీదిస్తాడు. ఎక్కడికెళ్ళినా, ఎందరిలో నిలబడినా తలెత్తుకు నిలబడేలా, సాహసానికి మారుపేరులా, సంతోషానికి సంకేతంలా తీర్చిదిద్దుతాడు. తల్లిలో వుండే బేలతనం తండ్రిలో వుండదు. అమ్మలా మనసుతో ఆలోచించని నాన్న బుద్ధికి పదునుపెడతాడు. అమ్మలా అక్కున చేర్చుకోడు, కానీ, ఎల్లవేళలా ఆలంబనగా నిలిచి వెన్నెముక బలంగా అయ్యేందుకు తోడ్పడ్తాడు.

ఫాదర్స్ డే కధ :

పిల్లల్ని కని పెంచి ఉత్తమ పౌరుగా తీర్చిదిద్దడములో తల్లి, తండ్రికి సమపాత్రలు ఉన్నప్పటికీ తల్లి పాత్రకు లభించిన గుర్తింఫు తండ్రి పాత్రకు లభించడము లేదు. ఆ విషయము గమనించి తండ్రిచేస్తూన్న త్యాగము తిరుగులేదని భావించి తన తండ్రి పాత్రకు తగిన గుర్తింపుకోసము  ఒక కూతురు పడిన తపననుండి పుట్టినదే నేటి తండ్రుల దినోత్సవము ...

పిల్లల్ని పెంచి , తద్వారా చక్కని సమాజానికి తోడ్పడే తండ్రి పాత్ర ప్రాముఖ్యాన్ని గుర్తిస్తూ ప్రశంసిస్తూ జరుపుకునే అందమైన రోజు ఫాదర్స్ డే . ఫాదర్స్ డే ఉత్సవాలు జరుపుకోవాలన్న అవసరాన్ని తొలిగా గుర్తించింది ... ఆ దిశగా ప్రయత్నాలు చేసింది వాషింగ్టన్ లోని స్పొకనేకు చెందిన లవింగ్ డాటర్ " సొనారా " తంద్రులందరి గౌరవార్ధం అధికారికంగా ఓ రోజును కేటాయించాలని ఆమె ఎంతగానో పోరాడి , ఫాదర్స్ డే పండుగను వెలుగుచూసేలా చేసింది .

ఆధునిక ఫాదర్స్ డే ఉత్సవాలకు మూలము అమెరికా సంయుక్త రాస్ట్రాలు కాగా కాలక్రమేన అన్నిదేశాలకు పాకింది . 1909 లో మదర్స్ డే ప్రవచనం విన్నప్పుడు అమెరికా లోని న్యూవాషింగ్టన్ లో నివాసముండే స్మార్ట్ కుటుంబము లో తండ్రి పోషించిన పాత్ర " ఫాదర్స్ డే " కి పునాది అయ్యింది . సొనారా బుర్రలోనికి ఫాదర్స్ డే ఆలోచన వచ్చింది . అప్పుడామెకు 27 సంవత్సరాలు . తన తండ్రి కష్టాన్ని గుర్తించడం ఆరంభించింది . హెన్రీ జాక్సన్ స్మార్ట్ , విలియమ్ స్మార్ట్ అనే దంపతులు స్పొకనే గ్రామములో ఉండేవారు . వారికి ఆరుగురు సంతానము . అందులో చిట్టచివరి సంతానము ' సొనారా ' అనె కూతురు . సొనారా కి 6 నెలలు వయసున్నపుడు తల్లి హెన్రీ మరణించినారు . అందిరి్కన్నా పెద్ద అమ్మాయి వయసు 12 యేళ్ళు . ఇది 1895 నాటి పరిస్ఠితి .. నాడు కూడా పురుషుడు గా విలియమ్ కి మరో భార్యను తెచ్చుకునే అవకాశము , హక్కు సమాజము లో ఉన్నాయి . కాని తన సంసారసుఖము కన్నా తండ్రి గా తన పాత్రను నిర్వహించేందుకే ఆయన ఇస్టపడ్డాడు . వ్యవసాయ క్షేత్రం లో కస్టపడి పనిచేస్తూ తన ఆరుగురు పిల్లలకు తల్లిలేని లోటు ఏమాత్రము తెలియనీయకుండా పెంచాడు . ముఖ్యము గా చిన్నదయిన సొనారా కి ఆయనే తల్లి .. తండ్రి . 6 నెలల పసిపాపకు పాలు పట్టడం , స్నానము చేయించడం , ఆహారము పెట్టడం , జోలపాడి నిద్రపుచ్చడం అన్నీ విలియమ్ చేశాడు . తల్లిపాత్రను అద్భుతంగా పోషించాడు .అసలు తల్లి ఉంటుందని కాని , తల్లి భిన్నమైన పాత్రను పోషిస్తుందని గాని సొనారా కి తెలియదు . ఆమె కు తెలిసింది తనను కంటికి రెప్పలా పాపాడిన తండ్రి మాత్రమే . ఆమెకి ఊహ తెలిసేటప్పటికి కళ ఎదుట కనిపించింది తండ్రే . దైవమ్లా తనను కాపాడిన ఆ తండ్రికి ఎలా ఋణము తీర్చుకోవాలా అని సొనారా ఆలోచించినది . ఆ ఆలోచన నుంచి వచ్చినదే అత్యంత ఘనం గా తండ్రి పుట్టినరోజు నిర్వహించడం . తన తండ్రి అత్యుత్తమ తండ్రి కాబట్టి ఆయన జన్మదిన వేడుకలు తండ్రులందరి జన్మదినం గా జరపాలని సొనారా భావించినది . అయితే తన తండ్రి విలియం పుట్టిన రోజు ఎప్పుడో సొనారా కి తెలియదు ... కాని ఆయన పుట్టింది జూన్ నెలలో అని తెలుసు . అందువల్ల జూన్ నెలలో ఓ రోజు తన తండ్రి పుట్టిన రోజుకు గ్రామము లోని వారందరినీ ఆహ్వానించినది . ఇది తన తండ్రి పుట్టిన రోజే కాదని ... తండ్రులు పోషించే పాత్రను మొత్తము సమాజానికి , ఇతర పిల్లలకు తెలియజెప్పే రోజని , అందుకే ఈ రోజును ఫాదర్స్ డే గా జరుపుకుందామని ప్రకటించింది . సొనారా చేసిన ఆ ప్రకటన ... ఆ పుట్టినరోజు నిర్వ్హించిన తీరు ఆ గ్రామము లోని చాలా మంది పిల్లలకు నచ్చినది . వారూ తమ తండ్రి పోషించిన పాత్ర గురించి ఆలోచించారు . ఫాదర్స్ డే అనే ఆలోచన క్రమముగా ప్రక్క గ్రామాల్కు పాకి అక్కడా జరుపుకోసాగారు .

ఒక రోజు మదర్స్ డే కోసం కేటాయించినప్పుడు ... ఫాదర్స్ డే కి ఎందుకు కేటాయించరాదని ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది . ఫాదర్స్ డే గుర్తింపుకోసం నిజాయతీగా ప్రచారము ఆరంభించింది . 1910 జూన్ 19 వ తేదీన స్పొకనే లో తొలి ఫాదర్స్ డే ను .. స్పొకనె మినిస్టీరియల్ అసోసియేషన్ , స్థానిక యంగ్ మేన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ ల మద్దతుతో జరిపించారు . మమతానురాగాలు అందించే తన తండ్రి పుట్టిన రోజుని జూన్ 5 న ఫాదర్స్ డే గా నిర్వహించాలని ఆమె భావించినా ఏర్పాట్లుకు తగిన సమయం చాలక పోవకపోవడం తొ " జూన్ మూడో ఆదివారము " నాడు నిర్వహించారు . అమెరికా లో ఫాద్ర్స్ డే ఉత్సవాలు ప్రాచుర్యము గడించాయి . అధ్యక్షుడు " ఉడ్రోవిల్సన్ " 1916 లో ఈ ఉత్సవాల్ని అధికారికం గా అమోదించారు . 1966 లో జూన్ మూడో ఆదివారము ఫాదర్స్ డే జరుపుకోవాలంటూ అద్యక్ష తీర్మానం పై అప్పటి అధ్యక్షుడు " లిండన్ జాన్సన్ " సంతకాలు చేసారు . తరువాత 1972 లో జూన్ మూడో ఆదివారము ఫాదర్స్ డే నిర్వహించడానికి శాశ్విత జాతీయ ప్రతిపత్తిని అధ్యక్షుడు " రాచర్డ్ నిక్సన్ " కల్పించారు . ఆ నాటి నుంది ప్రపంచవ్యాప్తము గా ఫాదర్స్ డే ప్రసిద్ధి గాంచినది .

ఈ ఫాదర్స్ డే జరుపుకోవడమనేది ఆచారముగా కొనీ వేల సంవత్సరాలక్రితమే ఉన్నదని వరిత్రకారులు చెపుతున్నారు . ఫాదర్స్ డే సంప్రదాయ ఆనవాళ్ళు బాబిలోన్ శిధిలాల్లో లభించాయని చెప్తారు . ఎల్మేసు అనే పిల్లవాడు నాలుగు వేల సంవత్సరాల క్రితం మట్టితో కార్డు తయారుచేసి దానిపై ఫాదర్స్ డే సందేశాన్ని చెక్కినట్లు చరిత్రకారులు తెలిపేరు . తన ఫాదర్స్ డే సందేశం లో ఎల్మేసు తన తండ్రి మంచి ఆరోగ్యం తో దీర్ఘకాలం జీవించాలని కోరతాడు . ఎల్మేసు కు అతని తండ్రికి ఏం జరిగిందన్న రికార్డులు అయితే లేవు కాని ఫాదర్స్ డే ఉత్సవాల్ని మాత్రం ప్రపంచవ్యాప్తం గా అనేక దేశాల్లో జరుపుకునే ఆచారము ఉన్నది .

ఫాదర్స్ డె మూలం అనేక సిద్ధాంతాలు ఉన్నాయి .
  • 1908 లో తొలి ఫాదర్స్ డే చర్చ్ సర్వీస్ వెస్టు వర్జీనియాలో ఆరంభం అయిందంటారు .
  • ఇంకొదరు వాషింగ్టన్ లోని వాంకోవర్ లో మొదటి ఉత్సవం జరిగిందంటారు .
  • తండ్రుల గౌరవాన్ని గుర్తించాలంటూ 1915 లో చికాగో ఓయన్స్ క్లబ్ అధ్యక్షుడు ' హ్యారీమీక్ ' తన సంస్థ తో తొలి ఫాదర్స్ డే జరిపాడంటారు .
  • ఫాదర్స్ డే ప్రారంభ ఘనత ను వెస్ట్ వర్జీనియాకు చెందిన శ్రీమతి చార్లెస్ క్లేటన్ కు దక్కుతుందని అంటారు .
ఫాదర్స డే జరుపుకోవాలన్న కాంసెప్ట్ మనదేశానికి (ఇండియా) కొత్తది ... పాశ్చ్యాత్య దేశాలనుండి దిగుమతి చేసుకున్న వేడుక . ఇవి సుమారు 100 సంవత్సరాల లోపే ఆరంభం అయిఉంటాయని అనుకోవచ్చు . అయితే భారతీయులలో ఉన్న సహజ సెంటిమెంట్  మూలంగా ఈ పండుగ విశేష ఆదరణ పొందినది .

--------------------------------

లైఫ్‌''జీవితమొక నాటకరంగం.. మనమంతా పాత్రధారులం'' అన్నాడు ప్రపంచ ప్రఖ్యాత రచయిత, నాటకకర్త షేక్స్‌ఫియర్‌. పుట్టింది మొదలు చనిపోయేవరకు ఎన్నో పాత్రలు పోషించాలి. కొన్నిట్లో జీవిస్తాం, కొన్నిట్లో నటిస్తాం. ఇతర పాత్రల సంగతి వదిలేస్తే.. తల్లి, తండ్రి పాత్రల్లో ఏ వ్యక్తయినా జీవించడమే తప్ప నటించడం వుండదు. కూతురుగానీ కొడుగ్గానీ పుట్టాడంటే ఇక అమ్మానాన్నల కుర్రతనమంతా అటకెక్కేస్తుంది.. ఇంకా చెప్పాలంటే కోరికలు, కాంక్షలు, స్వార్థం గట్రా అన్నీ అంతరించిపోతాయి. ఎక్కడలేని పెద్దరికం వచ్చేస్తుంది. అక్కణ్ణించి ప్రతి క్షణం బిడ్డ కోసమే ఆరాటం. ఎలా పెంచి పెద్దచేయాలి,ఎంత ఎత్తుకు ఎదిగేలా చేయాలి అని నిరంతరం తహతహలాడుతూ, తపనపడుతూ వుంటారు. నిన్నటి జలసాలు మాయమై పొదుపు పథకాలు బయల్దేరతాయి. బిడ్డ భవిష్యత్తుకు పునాదులు పడ్తాయి.

భర్త, భార్యకే కాదు, పిల్లలకూ రక్షకుడే. కడుపున కాయ కాయగానే ఇంటి పెద్దయిపోతాడు. తల్లినెంత ఇష్టంగా, గారాంగా కావిలించుకు పడుకున్న పాపాయి అయినా, పక్కన తండ్రి ఉన్నప్పుడే స్థిమితంగా, ధైర్యంగా నిద్దరోతుంది. ఊహ తెలీని చిన్నారులను కదిలించండి.. ''మా నాన్న రౌడీలనే కాదు, దెయ్యాలను కూడా తన్నేయగలడు'' అని బీరాలు పోతుంది. క్లాసురూం లో తోడి పిల్లాడితో గొడవపడిన కొడుకు ''మా నాన్నకు చెప్పిఎముకలు విరిగేట్టు తన్నిస్తా జాగ్రత్త'' అని బెదిరిస్తాడు. ఇందులో ఎలాంటి అతిశయం, అతిశయోక్తి లేదు. తండ్రిని చూస్తే పిల్లలకు ధీమా, ధైర్యం తన్నుకొస్తాయి. ఆయన్ను తల్చుకుంటే చాలు స్థైర్యంగా, స్థిమితం గా, మహోత్సాహంగా వుంటుంది.

లైఫ్‌ప్రతి కూతురికి, ప్రతి కొడుక్కి తన తండ్రితో ఏవో మధురానుభూతులు వుండితీర్తాయి. ఆ జ్ఞాపకాల పొరల్లోంచి కమ్మటి స్మృతులు తొంగిచూస్తుంటాయి. వెంటే నడిచొస్తుంటాయి. తలలో మల్లెమాల పెట్టుకుంటే రోజంతా ఎంత ఆహ్లాదంగా వుంటుందో, అలా జీవితాంతం నాన్నతో పెనవేసుకున్న అనుబంధపు తీయటి గుర్తుల పరిమళాలు మనల్ని జీవన పర్యంతం ఆనందపరుస్తూనే వుంటాయి. నాన్న చెప్పే కథల్లో లోకం పోకడ అంతా ఇమిడివుంటుంది. కష్టనష్టాల కంటకాలనుండి మనల్ని మనం ఎలా సంరక్షించుకోవాలో, జిత్తుల మారి నక్కలు, క్రూరమృగాల బారిన పడకుండా ఎలా తప్పించు కోవాలో, డబ్బెలా సంపాదించాలో, దాన్నెలా సద్వినియోగం చేసుకోవాలో, ఏ రకంగా పొదుపు చేయాలో, ఎలా ఇన్‌వెస్ట్‌ చేయాలో... ఒకటా రెండా తండ్రి ఎన్నో నేర్పిస్తాడు. ఎంతో తర్ఫీదిస్తాడు. తడబడితే చెయ్యందిస్తాడు. తప్పటడుగులు వేస్తే సరిచేస్తాడు. వేగంగా పరిగెట్టేందుకు కిటుకులు చెప్తాడు. గమ్యం చేరేందుకు దారి చూపిస్తాడు. అనుక్షణం ప్రోత్సహిస్తూ ఉత్సాహపరుస్తాడు.


పిల్లల్ని పెంచడం అంత తేలికయినా పనేం కాదు. మొక్కలు, పశువుల్లా చిన్నారులు గాలికి పెరగరు. ఒకవేళ అదే జరిగితే గాలిమనుషులే అవుతారు తప్ప ప్రయోజకులు కారు. మరి ఓ పద్ధతిగా, క్రమశిక్షణతో పెంచాలంటే అది తండ్రికే సాధ్యం. అమ్మ ఆప్యాయంగా పిల్లలు కోరిందల్లా వండిపెడ్తుంది. ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తుంది. కానీ, మంచిచెడుల విచక్షణ, తప్పొప్పుల విజ్ఞత, అటు విజ్ఞానం, ఇటు లోకజ్ఞానం అన్నీ తెలియజెప్పేది నాన్నే. పిల్లలు మాట వినకుండా మారాం చేసినా, తప్పుచేసి విసిగించినా, మూర్ఖత్వంతో వేధించినా అమ్మ మనసు తల్లడిల్లిపోతుంది. అప్పటిదాకా అల్లరిని భరించి, భర్తకు ఎంతమాత్రం తెలీకుండా కప్పిపెట్టి, రక్షణకవచంలా నిలిచిన అమ్మే ఆ దుడుకుతనం మితిమీరినప్పుడు ఈదురుగాలికి కొమ్మ ఊగిసలాడినట్టు కలతచెంది, కల్లోలపడ్తుంది. ఇలాగే కొనసాగితే బిడ్డ బాగుపడకపోగా చెడిపోవచ్చని భయపడి, బెంబేలెత్తి ఆ భర్తకే ఫిర్యాదు చేసుకుంటుంది. అలాంటప్పుడు నయానో, భయానో, లాలించో, దండించో బిడ్డను దారికి తెచ్చేది తండ్రే.

అడపాదడపా పత్రికల్లో కూతుర్ని చెరిచిన తండ్రి గురించిన కథనాలు చదివినప్పుడు ఎంతటి శాంతమూర్తులకయినా కడుపు తరుక్కుపోతుంది. ఐదేళ్ళ పిల్లమీద కూడా అత్యాచారం చేస్తున్న తండ్రుల గురించి విన్నప్పుడు జుగుప్స కలుగుతుంది. నిన్నగాక మొన్న పన్నెండేళ్ళుగా భయంకరంగా బ్లాక్‌మెయిల్‌ చేస్తూ, అనుక్షణం టార్చర్‌పెడ్తూ కన్నకూతుర్ని లైంగిక హింసలకు గురిచేసిన కసాయి తండ్రిని ఛానల్లో చూసినప్పుడు ఇలాంటివాళ్ళని మూడో కంటికి తెలీకుండా చీకటిగదిలో పడేసి, తిండి, నీళ్ళు ఇవ్వకుండా చచ్చేట్టు నరకయాతన పెడితే బాగుండు అనిపిస్తుంది కదూ! నిజానికి ఫాదర్స్‌ డేలాంటి ఓ మంచిరోజున తండ్రి అనే పదానికే తీరని కళంకం తెచ్చే ఆ నరరూప రాక్షసులను ఛస్తే తల్చుకోకూడదు. కానీ, ఇంత మధురమైన, ఆత్మీయమైన రిలేషన్‌లో అంత హీనులు కూడా ఉన్నారని చెప్పడంకోసమే గుర్తుచేయాల్సి వచ్చింది.

ఏదేమైనా నాన్నంటే ప్రేమకు చిరునామా, జీవితానికి ఆలంబన. బిడ్డలను రత్నమాణిక్యాలుగా తీర్చిదిద్దుతున్న తండ్రులకు హ్యాట్సాఫ్‌! కూతుళ్ళు ఎలాంటి న్యూనతాభావం లేకుండా ధైర్యంగా, ధీమాగా తిరిగేలా పెంచుతున్న నాన్నలకు జేజేలు!!

  • ==============================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .