Tuesday, April 5, 2011

ఆల్‌ ఫూల్స్‌ డే,All fools Day



గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (April 01) న -ఆల్‌ ఫూల్స్‌ డే,All fools Day- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము


Fools_Day:ఏప్రిల్ ఒకటిన ఒకరిని ఫూల్ చేసి ఎవరెస్టు ఎక్కినంతగా సంతోషిస్తుంటాం. మనకంటే పెద్దవాళ్లను ఫూల్ చేయడానికి పేటెంట్ ఉన్న రోజు.అందరినీ ఆటపట్టించడం, సరదాగా అబద్ధాలు చెప్పి ఏడిపించడం, వేళాకోళం చేయడం ... నిజమని నమ్మేస్తే ।ఫూల్‌ అంటూ గేలిచేయడం. ఏప్రిల్‌ ఫస్ట్‌ ప్రత్యేకత. ఆల్‌ ఫూల్స్‌ డే పేరుతో దీన్ని ప్రపంచ మంతటా అనేక దేశాల్లో సరదాగా జరుపుకొంటున్నారు. ఏప్రిల్‌ ఒకటి. ఆల్‌ ఫూల్స్‌ డే. ఈరోజు ప్రపంచమంతా సరదా అబద్ధాల పండుగ చేసుకుంటుంది. ఎన్నో ఏళ్లుగా ఏప్రిల్‌ ఒకటిన ఫూల్స్‌ డేను జరుపుకుంటున్నా ఇప్పటికీ, అతికినట్టు చెప్పే అబద్ధాల్ని అనుకోకుండానే నమ్మేస్తాం. జనాల్ని ఏప్రిల్‌ ఫూల్‌ చేయడంలో మీడియా, ముఖ్యంగా బ్రిటన్‌ మీడియా చాలా ముందుంటుంది.

పదహారో శతాబ్దం మధ్య వరకు యూరప్‌ లో ఏప్రిల్‌ ఫస్ట్‌న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేవారు. నూతన సంవత్సరం ఉత్సవాలు, వసంత కాలపు సంబరాలు పదిరోజుల పాటు ప్రజలు ఆనందంగా నిర్వహించుకునేవారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఒకరికి మరోకరు బహుమతులు ఇచ్చే ఆచారాన్ని పాటించేవారు. అయితే 1582లో రాజైన చార్లెస్‌-9 కేలెండెర్‌ని మార్చేసి జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవా లని ఆదేశాలు జారీ చేశాడు. అయితే సమాచర వ్యవస్థ అంతగా వృద్ధి చెందని ఆ కాలంలో ఆ వార్త దేశంలోని ప్రజలందరికీ త్వరగా చేరలేదు. రాజధానికి దగ్గర్లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే చేరింది. ఈలోగా మళ్ళీ కొత్త ఏడాది వచ్చేసింది. రాజాజ్ఞ తెలిసిన కొందరు జనవరి ఫస్టున కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. కొందరు మాత్రం మొదటి నుంచీ వస్తున్న ఆచారాన్ని మార్చడానికి ఇష్టప డక జరుపుకోలేదు. వాళ్ళు మాత్రం యధా విధిగా ఏప్రిల్‌ 1 వరకు ఆగి ఆ రోజు మాత్రమే కొత్త సంవత్సర వేడుకల్ని జరుపు కున్నారు. జనవరి ఫస్ట్‌న జరుపుకున్న వారు ఇది చూసి, ఏప్రిల్‌ ఫస్ట్‌న జరుపుకున్న వారిని ఫూల్స్‌ అని పేర్కొంటూ గేలి చేసేవారు. వాళ్ళకి తెలీకుండా పేపర్‌ చేపల్ని వాళ్ళ వెనక భాగాన కట్టి ఆటప ట్టించేవారు. అంతే కాకుండా వాళ్ళని గేలానికి చాలా తేలిగ్గా తెలివితక్కువతనంతో దొరికిపోయే చేపలక్రింద జమకట్టి, వాళ్ళని ఏప్రిల్‌ ఫిష్‌ అంటూ అల్లరి పెట్టేవారు.

ఈ ఆటపట్టించే విధానం ఏప్రిల్‌ ఫూల్స్‌ డేగా మరో రెండు వందల ఏళ్ళకల్లా అమె రికా, బ్రిటన్‌, స్కాట్లండ్‌ తదితర దేశాలకు తెలిసిపోయింది. అలా ప్రపంచ మంతా పాకిపోయింది. ఒకరిపై మరొకరు ఎన్నో రకాల జోక్స్‌ వేసుకోవడం ఆనవాయితీ అయ్యింది. అది రానురాను ప్రాక్టికల్‌ జోక్స్‌ చేసుకునే స్థాయికివెళ్ళింది. ఈ ప్రాక్టికల్‌ జోక్స్‌ మొదట్లో సున్నితంగా ఉన్నా, అప్పుడప్పుడు కాస్త శ్రుతి మించడం జరుగుతూ ఉంది. ఏదేమైనా సరదాగా, సంతోషంగా జరుపుకునే ఈ వేడుక మన దేశంలోనూ మారుమూల గ్రామాల్లోకి సైతం పాకిపోయింది.

ఈ రోజు మనమంతా ఖుషీగా పండగ చేసుకోవాల్సిన రోజు. .. అదే మన ఆల్ ఫూల్స్ డే. గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పండి, మనం ఫూలిష్ గా బతకడం లేదా?
  • =========================================
Visit My Website - > Dr.seshagirirao.com/

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .