Sunday, January 31, 2010

కుష్టువ్యాది నివారణ దినోస్థవం,AntiLeprosy Day


  • గాంధీజీ .
  • గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (జనవరి 30) -కుష్టు వ్యాధి నివారణ దినోస్తవం- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

అది 1917 వ సంవతరం బీహార్ రాస్ట్రం చంపారణ్ గ్రామములో నీలి మందు పండిస్తున్న రైతులను బ్రిటిష్ వారు హింసిస్తున్నారు . తక్కువ కూలీ ఇచ్చి ఎక్కువ పనులు చేయిస్తున్దేవారు . తమ దేశానికి ఉత్పత్తి ని ఎగుమతి చేసుకుంటూ వాళ్ళు తయారు చేసిన బట్టలకు అద్దుకునేవారు . ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మహాత్మా గాంధి అక్కడకు చేరుకున్నారు . వాళ్ళ దయనీయ పరిస్థితులను కళ్ళారా చూశారు . ముందుండి విప్లవాన్ని నడిపించారు . ఈ సమయం లో ప్రతిరోజూ విప్లవకారులు , గాంధీజీ కలిపి ప్రార్ధన చేస్తుండేవారు . ఒకరోజు ప్రార్ధనకు ఓ వ్యక్తి రాకపోవడం గాంధి గమనించారు . విశ్రాంతి గదివైపు వెళ్ళేరు ... ఆ వ్యక్తీ ఓ చిన్న దీపపు వెలుగులో తన కాళ్ళకు , చేతులకు చిమ్ముతున్న చీము నెత్తురు తుడుచుకుంటున్నాడు . గాంధిజీ గుండె కరిగింది . అంటే తిన్నగా వ్యక్తీ వద్దకు వెళ్లి కట్లు కట్టి , సపర్యలు చేశారు . ఆరోజు నుంచి గాంధిజీ ప్రతిరోజూ కుష్టు రోగులకు సేవలు చేస్తుండేవారు .

ఆయన సేవలకు గుర్తింపుగా గాంధిజీ వర్ధంతి జనవరి 30 న జాతీయ కుష్టు వ్యాధి నివారణ దినోస్తవం గా జరుపుకుంటున్నారు .
కుష్టువ్యాది బ్యాక్టీరియా (Mycobacterium leprae)వలన వచ్చే అతి సామాన్యమైన అంటువ్యాధి . ముఖ్యం గా చర్మానికి , నరాలకు (Nerves) సోకుతుంది . చాలా నెమ్మదిగా పెరిగి వ్యాధి లక్షణాలు బహిర్గతం కావడానికి సగటున మూడేళ్ళు పడుతుంది .. దీనికి వయసు , లింగ బేధము లేదు . 1973 లో హెన్సెన్ (Hensen) అనే నావే శాస్త్రవేత్త ఈ


వ్యాది కారకమైన సుక్ష్మజీవిని కనుగొన్నారు .
లక్షణాలు :

  • Leprosy_thigh_demarcated_cutaneous_లేసిఒంస్

  • శరీరం పై పాలిపోయిన లేదా రాగి రంగు మచ్చలు ,
  • కాళ్ళు , చేతులు తిమిర్లు గా ఉండడం ,
  • ఎంతకీ మానని పుండ్లు ,
  • చర్మము పై ముడతలు లాంటి కాయలు కనిపించడం ,
  • మచ్చలపై నొప్పి తెలియక పోవడం ,
వ్యాది నివారణ :
పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే డాక్టర్ ని సంప్రదించాలి . ఈ వ్యాది అంటు వ్యాధి , స్పర్చ ద్వారా , రోగినుండి వచ్చిన గాలి ద్వారా , సన్నిహిత సాన్నిధ్యం ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది .
బహుళ ఔషధ చికిస్త ద్వారా నయం చేయవచ్చును . ముక్యం గా "దాప్సోనే(Dapsone) , "రిఫామ్పిసిన్(Rifampsin)" మున్నగునవి . ప్రారంబము లో జబ్బును గుర్తించి మందులు వాడితే అంగవైకల్యాన్ని నివారించవచ్చును .

ప్రాచీన కాలంనుంచి పీడిస్తున్న కుష్టు వ్యాధి

-ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 31వ తేదీనాడు అంతర్జాతీయ కుష్టు నివారణ దినం నిర్వహి స్తున్నారు. కుష్టువ్యాధిని హాన్సెన్స్‌ డిజీస్‌ అని కూడా అంటారు. కుష్టు అతి ప్రాచీన కాలం నుంచి ప్రజలను పీడిస్తున్న దీర్ఘకాలిక వ్యాధి.
సుమారు నాలుగు వేల ఏళ్లనుంచి ఈ వ్యాధి ఉన్నట్లు ఆధారాలున్నాయి. ప్రాచీన భారత దేశంలోనూ, చైనా, ఈజిప్టు దేశాల్లోనూ ఈ వ్యాధి ఉనికి నాలుగు వేల ఏళ్లనాడే ఉంది. మనిషి నాడీ మండల వ్యవస్థ మీద దీని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా చేతులు, కాళ్లు, ముఖంపై దీని ప్రభావం అధికం.

కుష్టు వ్యాధి మైకోబాక్టీరియమ్‌ లెప్రే, మైకో బాక్టీరియమ్‌ లెప్రోమాటోసిస్‌ అనే బాక్టీరియాల వల్ల సోకుతుంది. ఈ వ్యాధికి సకాలంలో చికిత్స చేయించుకోకపోతే అది మరింతగా పెరిగి చర్మానికి, నరాలకు, కాళ్లు, చేతులకు, కళ్లకు హాని కలిగిస్తుంది.
కుష్టువ్యాధి ప్రత్యక్షంగా శరీరాంగాలు వాటం తట అవే తెగిపోయేలా (కాలివేళ్లు, చేతుల వేళ్లు మొదలైనవి) చేయదు. కానీ, వాటి రూపం మారడం కాని, స్పర్శ లేని కారణంగా రోగికి తెలియకుండానే ఇతరత్రా తెగిపోవడం కాని జరుగుతుంది.
1995 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు రెండునుంచి మూడు మిలియన్ల మంది ఈ వ్యాధికి గురై, వికలాంగులుగా మారినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు పేర్కొంటు న్నాయి. గత ఇరవై సంవత్సరాల కాలంలో సుమారు 15 మిలియన్ల మంది వ్యాధిగ్రస్తులకు చికిత్స చేసి వ్యాధిని తగ్గించారు.

ముదిరిన స్థాయిలో ఉండే కుష్టు వ్యాధి గురించి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అనే రకాల అపోహలు ఉన్నాయి. వీటిని ఏజ్‌ ఓల్డ్‌ సోషల్‌ స్టిగ్మా అని కాని లెప్రసీ స్టిగ్మా అని కాని వ్యవ హరిస్తుంటారు. ఈ స్టిగ్మా కారణంగానే
బాధి తులు తొలిదశలోనే స్వయంగా చికిత్సకు వైద్యుల వద్దకు రావడానికి జంకుతుంటారు.

కుష్టు వ్యాధికి శక్తివంతమైన చికిత్స 1930 సంవత్సరంనాటికే అందుబాటులోకి వచ్చింది. ఆనాడు డాప్సోన్‌, మరి కొన్ని ఔషధాలను తయారుచేయడంతో ఈవ్యాధికి చికిత్స అందు బాటులోకి వచ్చినట్లయింది. అయితే, ఈ ఔష ధాలను అవసరానికి మించి ఉపయోగించడం కారణంగా వ్యాధి మరింతగా ప్రబలింది. 1980వ దశకంలో బహుళ ఔషధ చికిత్స (మల్టీ డ్రగ్‌ థెరపీ - ఎండిటి) అందుబాటులోకి వచ్చిన తరువాత విజయవంతంగా చికిత్స చేయడం సుసాధ్యమైంది.


పూర్తీ వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -> Leprosy

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .