Sunday, November 28, 2010

Child Rights Convention Day , చైల్డ్ రైట్స్ కన్వెన్షన్‌ డే,బాలల హక్కుల దినోత్సవం


  • https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhRr8qZCsHRfDqDzjKJd493A_s2tW9KxojQzgXKnOuncSnLUO9VDrzORzTDeGQBtMt8izpqjFxMdT2-_cJSou5m2MvLZnYN2sosu_VsPFFAba7ASJT7sjooWCcWzj7VOclmr8MDjJ_4DZa3/s1600/Children+day.jpg

  • ప్రతి సంవత్సరం నవంబరు 20న బాలల హక్కుల పరిరక్షణ దినంగా పాటిస్తున్నాం
గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .
  • పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (నవంబరు 20 న ) బాలల హక్కుల పరిరక్షణ గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

మంచీ చెడూ పూర్తిగా అర్థం చేసుకోలేని బాలలకు హక్కులేంటి? అనుకోవచ్చు! కానీ సమాజంలో బలహీనులూ, దోపిడీకి గురయ్యే వారిలో పిల్లలూ వున్నారు. పిల్లలను దోచుకునే పెద్దలున్న చోట చిన్నారులకు హక్కులుండడం తప్పనిసరి. ఈ కారణంచేతే ఐక్యరాజ్యసమితి పిల్లల హక్కులకోసం ఒక ఒప్పందాన్ని ఆమోదించింది. చైల్డ్‌ రైట్స్‌ కన్వెన్షన్‌ (సిఆర్‌సి)గా పేర్కొనే ఈ ఒప్పందం గురించి అందులో పేర్కొన్న హక్కుల గురించి ప్రత్యేకంగా ప్రచారం చేయడానికి నవంబర్‌ 20వ తేదీని బాలల హక్కుల దినోత్సవంగా నిర్ణయించింది. ఆ హక్కులేంటంటే ...-జీవించడం, అభివృద్ధి చెందడం -సముచితమైన జీవన ప్రమాణాలు, ఉత్తమ ఆరోగ్య ప్రమాణాలు, సమర్థవంతమైన ఆరోగ్య సేవలు -అంగవికలురైన పక్షంలో ప్రత్యేక సంరక్షణ -వ్యక్తి గౌరవానికి భంగం కలగకుండా తమ పనులు తామే చేసుకునేలా సమాజంలో వారు క్రియాశీలురుగా వుండేలా తీర్చిదిద్దడం -సాంఘిక భద్రత-అపహరణల నుంచి రక్షణ -చక్కటి వాతావరణంలో తల్లిదండ్రులతో కలిసి జీవించే హక్కు -ఉచిత ప్రాథమిక విద్య -పిల్లల వ్యక్తిత్వ, ప్రతిభ, మానసిక శారీరక సామర్థ్యం పూర్తిస్థాయిలో వికసించేటటువంటి చదువు -యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలవంటి అత్యవసర పరిస్థితుల్లో కుటుంబానికి దూరమైనప్పుడు, చట్టంతో సంఘర్షణ చేయాల్సి వచ్చినప్పుడు ప్రత్యేక రక్షణ హక్కు -బాల కార్మిక సమస్య, మత్తు పదార్థాల దుర్వినియోగం, లైంగిక దోపిడీ, పిల్లలను అమ్మడం, అపహరించడం, వ్యభిచారంలోకి దింపడం వంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రత్యేక రక్షణ ....కోరే హక్కు పిల్లలకుంది.

  • బాలల హక్కులు చరిత్ర... తీర్మానాలు.

బాలల హక్కుల ను గుర్తించడం 1924లో నానాజాతి సమితి మానవహక్కుల ప్రకటనతో ప్రారంభమైందని భావించవచ్చు. పిల్లల బానిసత్వానికి, బాలకార్మిక వ్యవస్థకు, పిల్లల వ్యభిచారానికి, విక్రయానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని ఆ ప్రకటనలో పిలుపు ఇవ్వడం బాలల హక్కులకు నాందిగా నాడు పలువురు అభిప్రాయపడ్డారు. తదుపరి ఐక్యరాజ్యసమితి బాలలహక్కుల పై 1959లో ప్రకటన చేసింది. 1979వ సంవత్సరాన్ని అంతర్జాతీయ బాలల సంవత్సరంగా ప్రకటించింది. 1989 నవంబరులో బాలల హక్కుల పరి రక్షణ పై సమావేశం నిర్వహించి ఆమోదించింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం నవంబరు 20న బాలల హక్కుల పరిరక్షణ దినంగా పాటిస్తున్నాం. 1990 సెప్టెంబరులో బాలల అభ్యున్నతి కోసం ఐక్యరాజ్య సమితి ప్రపంచ సదస్సు నిర్వహించింది. 1992లో చైల్డ్‌ రైట్స్‌ కన్వెన్షన్‌ పై భారత్‌ కూడా సంతకం చేసింది. దీనిని సంక్షిప్తంగా ''సి.ఆర్‌.సి'' అంటారు.
ప్రతిపాదనలు, హక్కులు
మానవ జాతి చరిత్రలో సి.ఆర్‌.సి ఒక మైలు రాయి వంటిది. పిల్లలకు ఇవ్వాల్సిన గౌరవం, కల్సించాల్సిన రక్షణ, అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలు అన్నీ ఇందులో ఉన్నాయి. సి.అర్‌.సి లో ఉన్న 54 నిబంధనలను నాలుగు రకాలుగా విభజించారు. తొలివర్గం ''సర్వైవల్‌ రైట్స్‌'' ఇవివారి ఉనికికి సంబంధించిన హక్కులు. రెండోరకం హక్కులు అభివృద్ధికి చెందిన ''డెవలప్‌మెంట్‌ రైట్స్‌'' మూడో రకం హక్కులు పరిరక్షణ అంటే ''ప్రోటెక్షన్‌ రైట్స్‌'' ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించిన ఈ హక్కుల పై 160 దేశాలు సంతకాలు చేశాయి. భారతదేశం 1992 డిసెంబరు 11న ఆమోదిస్తూ సంతకం చేసింది. మనదేశం ఆమోదించిన హక్కులు గూర్చి క్లుప్తంగా తెలుసుకుందాము.
బాలల హక్కులు
18 సంవత్సరాలలోపు బాలందరికీ ఈ హక్కులు వర్తిస్థాయి. సమానత్వం, కులం, మతం, జాతి, భాష, ఆడ, మగ, పుట్టుక ప్రదేశం వంటి ఏ విధమైన వివక్షను ఎవరి పట్లను చూపరాదు. బాలల ప్రయోజనాలు బాలల హక్కుల కార్యా చరణను చేపట్టినప్పుడు వారి సంపూర్ణ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకోవాలి. హక్కుల అమలుకై తీర్మానాలు, గుర్తించిన హక్కుల అమలుకి శాసన పరమైన, పాలనా పరమైన కార్యక్రమాలు చేపట్టాలి. అవసరమైతే అంతర్జాతీయ సహకారం తీసుకోవాలి. బిడ్డ పుట్టగానే పేరు, జాతీయత కలిగి వుండటం, తల్లిదండ్రలతో కలిసి జీవించడం బాలల హక్కు. బాలలను అక్రమంగా రవాణా చేయడం, వ్యభిచార వృత్తి లో దించడం, జీతాలకు పెట్టడం నేరం. బాలలు వారి అభిప్రాయాలను పాటలు, బొమ్మలు, ఆటలు, రచనల ద్వారా వ్యక్తం చేయవచ్చు. బాలలు తమకు నచ్చిన మతాన్ని కలిగివుండవచ్చు, తమ వృద్ధికై సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు.
బాలలకు విజ్ఞానాన్ని అందిచడానికి ప్రభుత్వాలు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు బాలల రక్షణకై శిశు సంరక్షణాలయాలు నిర్వహించాలి. తల్లిదండ్రులు ఇద్దరూ పనుల్లోకి వెళ్ళినట్లయితే ఆబాలల బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. పిల్లలను ఎవరైనా హింసించినా,దౌర్జన్యం చేసినా, వేధించినా నేరం. బాలల్ని రక్షించేందుకు ప్రభుత్వాలు చట్టాలు చేయాలి. శరణార్ధులుగా మారిన బాలలకు మానవతతో సాయం చేయాలి. మానసికంగా, శారీరకంగా వికలాంగులైన వారి వృద్థికి, వారిలో ఆత్మ విశ్వాసం పెంపుదలకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి.
బాలలు ఆరోగ్యంగా జీవించే హక్కు వుంది, సామాజిక భద్రత పోందే హక్కువుంది. ఉచిత నిర్బంధ విద్యను పొందడం బాలల హక్కు. బాలలకు విశ్రాంతిగా వుండే హక్కువుంది. ఆటలు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే హక్కువుంది. ప్రమాదకరమైన పనులు గనుల్లో, పేలుడు పదార్ధాల తయారీలో, హోటళ్ళలో బాలల్ని పని చేయించరాదు. మాధక ద్రవ్యాల నుండి బాలలను దూరం చేయాలి. వారికి అందుబాటులో వుంచడం, వారి ద్వారా తెెప్పించు కోవడం నేరం.
బాలల్ని నిర్భంధించరాదు.లైంగిక ధూషణ చేయరాదు. బాలల సంక్షేమానికై దోపిడి ఏ రూపంలో వున్నా ప్రభుత్వాలు నిషేధించాలి. 18 సంవత్సరాలలోపు వయస్సు బాలల్ని విడుదల చేయటానికి వీలులేని నేరాలకు ఉరి శిక్షగాని, యావజ్జీవ శిక్షగాని విధించరాదు. దేశంలో గాని, అంతర్జాతీయంగా గాని బాలలకు ఇంత కంటే మెరుగైన హక్కులను అందించే చట్టాలు ఉంటే ఆ హక్కులను పొందటానికీ బాలలకు హక్కు ఉంది. ఇవి బాలల హక్కులపై ఐక్య రాజ్యసమితి ఒడంబడిక యొక్క సంక్షిప్త రూపం.

మన దేశంలో పిల్లల స్ధితిగతులు....
దేశంలో పుట్టిన 12 మిలియన్ల బాలికల్లో 3 మిలియన్ల మంది తమ 15వ పుట్టిన రోజును, ఒకమిలియన్‌ మంది తమ మొదటి పుట్టిన రోజును జరుపుకోకుండానే మరణిస్తున్నారు, లింగ విచక్షణ వల్ల ప్రతి ఆరుగురిలో ఒక బాలిక చావుకి గురవుతుంది. 50% బాలబాలికలకు పోషకాహారం అందడం లేదు. బాలురలో 5 గురిలో ఒకరు, బాలికలలో ఇద్దరిలో ఒకరు పోషకాహారం పొందడం లేదు. ఇక 2 సం|| వయస్సు లోపు శిశువులలో 58% మందికి పూర్తిగా వాక్సి నేషన్‌ అందడం లేదు. 24% పిల్లలకి ఎలాంటి వాక్సినేషన్‌ ఇవ్వలేదు. దేశంలో 60% పిల్లలు రక్తహీనతకు గురవుతున్నారు. దేశంలోని వ్యాపార లైంగిక వ్యక్తుల్లో 40% బాల బాలికలే. ''ఇంటర్‌ నేషనల్‌ సెంటర్‌ ఆన్‌ లేబర్‌'' నివేదిక ప్రకారం దేశంలో 25 మిలియన్లు నుంచి 30 మిలియన్ల వరకు బాల కార్మికులున్నారు. దేశంలో 50% బాలలు పాఠశాలలకే వెళ్ళడంలేదు. ఇలా చెప్పుకొంటూ పొతేే దేశంలో బాలల జీవితం కన్నీటిమయం.
అందరూ స్పందించాలి :
నేటి బాలలే రేపటి పౌరులు. నవభారత నిర్మాతలు. ఈ మాటలు వినడానికి వింపుగా వున్నాయి. కాని పైన వివరించిన స్థితిగతులు పరిశీలిస్తే రేపటి పౌరులకు మనం ఇస్తున్న ప్రోత్సాహం ఇదా? యని ఆలోచించక తప్పదు. ప్రపంచంలో మరే దేశంలో లేనంత పెద్ద సంఖ్యలో పిల్లలున్న దేశం మనదే. దేశంలో నేడు 18 సంవత్స రాలలోపు వున్న వారి సంఖ్య 45 కోట్లు. ఇటువంటి యవతరాన్ని ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచి ఆరోగ్యకరమైన పౌరులుగా తీర్చి దిద్దాల్సిన భాధ్యత అందరిపై ఉన్నది. తల్లిదండ్రులు తమ బిడ్డలకు సకాలంలో వాక్సినేషన్‌ ఇప్పించాలి. విద్యను అందించాలి. ప్రభుత్వం ఆర్యోగ్య, విద్యారంగ అభివృద్ధికి చిత్తశుద్ధితో నిధులు కేటాయించాలి. సమాజంలోని అందరూ బాలల సంక్షేమం తమ సంక్షేమంగా భావించి సంవత్సరంలో ఒక్కరోజు తమ సంపాదనను పిల్లల సంక్షేమానికి విరాళంగా ఇవ్వాలి. 'నేటి బాలలే రేపటి పౌరులు'' అనేది నినాదం కాకుండా విధానంగా మారితే దేశంలో బాలల జీవితం ఆనందదాయకం. మరి ఆరోజుకై అందరం స్పందిద్ధాం..... చేయూత నిద్ధాం....
  • ====================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

Friday, November 26, 2010

World Tolerance Day , వరల్డ్ టాలరెన్స్ డే , ప్రపంచ సహన దినోస్థవం


  • ప్రపంచ సహన దినోత్సవం ఏటా నవంబర్ 16 న జరుపుకుంటున్నారు ..
గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .
పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (నవంబరు 16 న ) సమాజములో సహనము (ఓర్పు) గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము

సహనము , ఓర్పు ... మనిషికి సహజ లక్షణము . మనుషుల మధ్య ఎన్నో తేడాలుంటాయి ... లావు , పోడుగు , చర్మపు రంగు , జుట్తు వంటి తేడాలు అంగీకరించినట్లే భిన్న ఆలోచనా విధానాలను సహజమైనవిగా అంగీకరించాలి . తన ఆలోచనా విధానానికి అందరూ బద్దులైవుండాలన్న నియంతృత్వపోకడ ఎంతమాత్రము సరైనది కాదు . ఆ ధోరణి ప్రదర్శించే వారంతా తమ సహజ సహన గుణం కోల్పోయి , అసహము లో కొట్టుమిట్టాడి , అసహనం నుండి పుట్టుకువచ్చే విధ్వంసపు ఆలోచనలతో తోటి వారికి , మొత్తం మానవాళికి నస్టము కలిగిస్తూ ఉన్నారు . శాంతియుత సహజీవనము ఉన్నప్పుడు సరైన లక్ష్యము దిశగా వెళ్తున్నట్టే లెక్క . . ఆ దిశ బాగున్నప్పుడు ప్రపంచాభివృద్ధి బాగుంటుంది . ఇటువంటి భావనలున్నప్పుడు తోటివారి పట్ల ఈర్శాద్వేషాలుండవు . దయాగుణము ఉంటుంది .

సహనమంటే అవతలి వారిని నిర్లక్ష్యం చేయుట లేదా బలవంతము గా భరించటం కాకూడదు . అవతలివారిని అర్ధముచేసుకుని గౌరవించగలిగిన సహనం కావాలి . ప్రపంచము లో లోపిస్తున్న ఈ " సహనము" మీద దృస్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి 1995 వ సంవత్సరాన్ని " ఇయర్ ఆఫ్ టాలరెన్స్ " గా జరపాలని తీర్మానించింది . ఆ సంవత్సరము నవంబరు 16 న సమావేశమైన యునెస్కో దేశాలు సహన సూత్రాలతోకూడిన ఒక సమగ్రమైన ప్రకటనను జారీచేసాయి . సహనం అవశ్యకతను గుర్తించాలన్న లక్ష్యము తో ప్రకటన విడుదలైనందున ప్రతి ఏటా ఆరోజునే ' ప్రపంచ సహన దినోత్సవం' గా జరపాలని నిర్ణయించారు .

ఎప్పుడో వందల సంవత్సరాల నాటి చేదు జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ తరువాత తరమువారిలో అనవసర విద్వేషాలకు , ఆగ్రహాలకు కారణమయ్యే కంటే ఆ చేదు జ్ఞాపకాఅలకు స్వస్తిపలికి ప్రశాంతజీవనానికి దోహదపడడము మంచిది . గతాన్ని మనం మార్చివేయాలి . కుల , జాతి , మత , సంస్కృతి , దేశ గోడలని చేదించి ప్రపంచ శాంతి సౌభ్రాతృత్వానికి తోడ్పడాలి . పొరుగు వారు ఏదో మాట అన్నారని అనవసర రాద్ధాంతము చేయక సహనము తో మంచి చెడులను గురించి ఆలోచించాలి . మంచినే బోధించాలి . . .మంచినే ఆచరించాలి . ప్రపంచీకరణ ప్రజలను దగ్గరికి తెచ్చింది . ఒకరి గురించి మరొకరు తెలుసుకునే అవకాశము పెరిగించి . అతివేగముగా సమావారము అందుతున్న నేపధ్యము లో బిన్నత్వం పై ఏకత్వం దిశగా ప్రపంవం పననిస్తుందేమోనన్న అనుమానము వస్తుంది కొందరికి . కనుకనే అందరూ సహనము తో (ఓర్పు తో) ప్రపంచ శాంతి కోసము పాటుపడాలి . చిన్న పెద్ద , పేదలు , ధనికులు , విద్యావంతులు , నిరక్షరాస్యులు , ఉద్యోగులు , నిరుద్యోగులు ఎవరైనా సరే దయతో , కరుణతో చేసే చిన్న చిన్న చర్యలే కొండంత బలము నిచ్చేదిగా ముందుకు సాగాలి .
  • =====================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

Thursday, November 25, 2010

World Kindness Day, ప్రపంచ దయాగుణ దినము




  • ఏటా నవంబర్ 13 వ తేదీన " వరల్డ్ కైండ్నెస్ డే(Kindness Day) " నిర్వహిస్తూ ఉన్నారు .
గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .
  • పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (నవంబర్ 13) సమాజము లో దయాగుణము గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము
ప్రపంచము లో అశాంతి పెరిగిపోతున్నది . అన్ని దేశాల వారిని ఉగ్రవాదము భయాందోళనలకు గురిచేస్తున్నది . ఏ క్షణము లో ఎటునుండి ఏ ప్రమాదము ముంచుకు వస్తుందోతెలియని పరిస్థి. ఏ తరహా బాంబు ఎవరిని బలితీసుకుంటుందో తెలియటములేదు . ఈ సమస్యకు పరిష్కారము కనుక్కోవలసిన అవరసము ఉంది . ప్రపంచమంతా ఒక్కటే ... అంతటా మానవులే , సృస్టి పరముగా అంతగా తేడా లేకున్నా కృత్రిమముగా సృస్టించుకున్న తేడాలు మనుషులను విడదీస్తునాయి . తమకు తాముగా సృస్టించుకున్న తేడాల్ని మూర్ఖం గా అనుసరిస్తూ ఇతర ఆలోచనా విధానాలను అంగీకరించని మనస్తత్వం పెరిగినందునే మానవాళి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నదన్నది .

జాలి , దయ , సహనము , కరుణ , కోపము , ఈర్శ్య , ఆందోళన ... అన్నీ కూడా మానవుల్లో ఉండే వివిధ కోణాలు . విభిన్న పరిస్థితుల్లో వివిధ రూపాల్లో ప్రతిస్పందించడం మానవ నైజము . అయితె వీటిలో కొన్ని అనుకూల ధోరణికి ప్రతిబింబాలయితే కొన్ని వ్యతిరేక ధోరణి స్పందనలు . శాంతము గా తోటివారికి సాయపడే గుణము కలిగి ఉండడం గొప్ప సంగతి . కస్టము లో ఉన్న వారిని ఆదుకోవాలన్న కరుణాభావం పరిసరాలన్నింటినీ పర్వదినం గా మార్చగల అపూర్వ శక్తిని కలిగివుంటుంది . దేశ సరిహద్దులు , సంస్కృతులు , కులము ,మతము , జాతి అన్నవేమీ లేకుండా మనమందరం ప్రపంచ పౌరులమన్న భావన కలిగి ఒకరి పై ఒకరు దయాభూత గుణము కలిఉండడాని చేసే ప్రయత్నమే ఈ ప్రపంచ దయాగుణ దినోత్సవం ముఖ్య ఉద్దేశము .
లేనివాడికి తగిన రీతిలో మనకున్నది కొంతలో కొంత ఇచ్చి సహాయపడడదే దయాగుణము . కస్టములో ఉన్నవారికి కొన్ని మంచి ఓదార్పు మాటలు ఎంతో ఊరటనిస్తాయి . ప్రపంచీకరణ ప్రజల్ను దగ్గరికి తెచ్చంది . అన్నింటా ఓ తోడు , మన పక్క నున్నవారు అవసరం వస్తే సాయపడరారన్న చిన్ని ఆశ చాలు బ్రతుకు తెరువు లో ఎంతోభారము తగ్గిపోతుంది . చిన్ని చిన్ని అవసరాలు , చిన్నపాటి మాటతో లభించే సాంత్వన చాలు ఎదుటివారికి , మనకు సంతృప్తిని , శాంతిని కలిగిస్తుంది .
  • ============================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

Monday, November 22, 2010

వరల్ద్ క్వాలిటీ డే , World Quality Day



వరల్ద్ క్వాలిటీ డే ....... నవంబర్ 11 న . ప్రపంచ వ్యాప్త వ్యాపార నాణ్యతా అవేర్నెస్ కోసము 1990 లో ఐక్యరాజ్యసమితి దీనిని ప్రారంభించినది .
ఈ పోటీ ప్రపంచములో సేవలైనా , వస్తువులైనా నాణ్యత ఉంటేనే మనగలుగు తాయి . ఓ వస్తువు మన ముందున్నాప్పుడు అది తప్పా వేరే గత్యంతరము కేదనుకునే పరిస్థితి ఇప్పుడు లేదు . మార్కెట్ నిండా రకరకాల ప్రత్యామ్నాయాలు... ఇస్టము వచ్చినదానిని ఎంచు కోవచ్చు . ఆ ఎంపికలో వినియోగధారుడి సంతృప్తికే ప్రధమ స్థానము . ప్రతి వస్తువులో , ప్రతి ప్రత్యామ్నాయము లో ఒక్కో ప్రత్యేక లక్షణాన్ని ఎత్తి చూపుతారు . వాటిలోని నాణ్యత నచ్చితేనే ఎంపిక లేకుంటే మరో బ్రాండ్ ఎలాగూ ఉండనే ఉంటుంది . ప్రస్తుత ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో విజయం నాణ్యత , కొత్తదనం , మనుగడ అన్న 3 అంశాలపై ఆధారపడి ఉంటుంది . ప్రపంచ వ్యాప్తంగా నాణ్యతకే పెద్ద పీట . ఈ ప్ర్రధాన్యతాన్ని తెలుపుతూ ప్రతిసంవత్సరము ప్రపంచ నాణ్యతాదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు . నాణ్యత ప్రాముఖ్యాన్ని తెలియజెప్తూ, వ్యాపారానికి ఇది తొలి పునాదిరాయి అన్న సంగతిని గుర్తుచేస్తూ " వర్ల్డ్ క్వాలిటీ డే ' నిర్వహిస్తారు . ప్రపంచవ్యాప్తంగాగల సంస్థలన్నీ వరల్డ్ క్వాలిటీ డె లో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తాయి . దేశ సంస్థల అభివృద్ధి , సంపదలకు నాణ్యత ముఖ్యమైన వనరు అని చాటి చెప్పేందుకు , ప్రపంచవ్యాప్త అవేర్నెస్ కోసము ఈ దినాన్ని జరుపుతారు .

ది చార్టర్డ్ క్వాలిటీ ఇనిస్టిట్యూట్ అందించే మద్దతు , సహకారాలతో " వరల్డ్ క్వాలిటీ డే ను " ఏటేటా నిర్వహిస్తున్నారు . బోర్డ్ రూమ్‌ ఎజెండాలలో క్వాలిటీని తొలి స్థానము లో ఉంచాలని , ఏ సంస్థకైనా క్వాలిటీ హృదయము మాదిరి ఉండాలని క్వాలిటీ పట్ల నిబద్దతను ప్రదర్శించడం ఈ సంస్ఠ లక్ష్యాలు . పోటీతత్వమార్కెట్ లో వ్యాపారాన్ని మెరుగుపరుచుకునేందుకు నాణ్యతను మెరుగుపరచుకోవాలన్నది ప్రధాన ఉద్దేశ్యము . ఉత్పత్తిలో , డెలివరీలో , వినియోగదారులకు కొత్తదనం , వారి పరిరక్షణా వైఖరిని మెరుగుపరచడం లో నాణ్యత అవసరము .

వనరుల్ని సక్రమ పంధాలో వినియోగించుకుంటూసామర్ధ్యాన్ని పెంచి , వృధను అరికడుతూ వ్యాపారాభివృద్ధి చేసుకోవాలి . చార్టర్డ్ క్వాలిటీ ఇనిస్టిట్యూట్ ఈ అంశాలపై లెక్చర్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నది . క్వాలిటీ అన్నది పూర్తి స్థాయి సంస్థ వెలను నిర్ణయిస్తుంది . ఈ విషయములో ప్రతి సంస్థా తన ఉద్యోగుల్లో ఎవేర్నెస్ పెంచాలి . నాణ్యత ఆచరణీయత పై క్లయింట్స్ తో జాయింట్ వర్క్ షాపులు , అంతర్గత సిబ్బంది తో సమావేశాలు నిర్వహించడము , ఉహ్యోగులందరికీ నాణ్యతకు సంబంధించి మెరుగైన శిక్షణా తరగతులు నిర్వహించడం , తమ తమ సంస్థలలో నాణ్యతను మెరుగుపర్చేందుకు ఉద్యోగులనుంచి సలహాలు కోరడము , నాణ్యతా నిపుణులనుండి సంబంధిత సమాచారాన్ని సేకరించడము చేయాలి . ఏడాదంతా ఎవేర్నెస్ పెంచేందుకు వివిధ కార్యకలాపాలు నిర్వహించాల్సిందిగా క్వాలిటీ గ్రూపుల్ని కోరడము , పని ప్రదేశాల పోస్టర్లు అంటించడము , వరల్డ్ క్వాలిటీ డే ప్రమోషనల్ వ్యాక్స్ ను అందించడము , నెలవారీ లంచ్ సమయాల్లో క్వాలిటీ పై చర్చలు , సెషన్లు నిర్వహించడము వంటి పనుల్ని ఈ రోజున చేపడతారు .

  • ==================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

Saturday, November 20, 2010

ప్రపంచ మధుమేహ దినం , World Diabetic Day



  • Diabetic Logo . Sugar checking meter

నవంబర్‌ 14 ప్రపంచ మధుమేహ దినం.

అంత ర్జాతీయ మధు మేహ సమాఖ్య, ప్రపంచ ఆరోగ్య సంస్థలు 1991 నుండి ప్రతి సంవ త్సరం నవంబరు 14వ తేదిని మధుమేహ దినంగా పాటిస్తు న్నాయి. 1922లో ఇన్సులిన్‌ హార్మోన్‌ను కనుగొన్న ఫ్రెడరిక్‌ బేంటింగ్‌ జన్మది నాన్ని పురస్కరించుకుని నవంబర్‌ 14న మధుమేహ దినంగా పాటిస్తున్నారు. 2006 డిసెంబర్‌ 20న ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లి ఆమోదించిన తీర్మానం ప్రకారం మధుమేహ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న, ఆందోళనకర దీర్ఘకాలిక వ్యాధి కాబట్టి 2007నుండి మధుమేహదినాన్ని ప్రజల్లో అవగాహం , చైతన్యం పెంచే కార్యక్రమాలతో సభ్యదేశాలన్ని అధికారికంగా జరపాలని ఐక్యరాజ్యసమితి పేర్కొన్నది. డయాబెటీస్ ఎలా వస్తుంది , దానివలం వచ్చే ముప్పు ఏమిటి , రాకుండా ఏమి చేయాలి , వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీలుకోవాలి అనే అంశాలను ప్రచారము చేసే ప్రయత్నమే ఈ డయాబెటిక్ డే సెలెబ్రేషన్స్ ముఖ్య ఉద్దేశము .

అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య ఈ వ్యాధికి సంబంధించిన ఒక ప్రాధాన్యతాంశాన్ని ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్తున్నది. 2009నుండి 2013వరకూ ఐదేళ్ల కాలానికి 'మధుమేహ విద్య -నివారణ' అన్న అంశాన్ని విస్త్రత ప్రజానీకంలోకి తీసుకెళ్లాలని ప్రకటించింది. అందులో భాగంగా 2010కిగాను 'ఈ క్షణమే మనం మధుమేహాన్ని నియంత్రించుకుందాం' అన్న ప్రచార నినాదాన్ని ప్రకటించింది. నేడు ప్రపంచవ్యాప్తంగా 30 కోట్లమంది రోగులతో ఎపిడమిక్‌ స్ధాయిలో విస్తరిస్తున్న మధుమేహవ్యాధిని ఎదుర్కునేందుకు ప్రపంచ ప్రజానీకం అన్నిరకాలుగా సంసిద్ధమవాలని బెల్జియంలో 2010 ప్రపంచ మధుమేహ దిన క్యాంపెయిన్‌ ప్రారంభ సందర్భంగా అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య అద్యక్షులు 'జీన్‌ క్లాడి మెబెన్యా' పిలుపునిచ్చారు. ఈ నేపధ్యంలో మధుమేహం గురించిన కొన్ని విషయాలు అవగాహన చేసుకుందాం.

ప్రపంచ మధుమేహ దినం లోగో ప్రాధాన్యత ఏమిటి ?

నీలిరంగు వలయం లోగో ఈ దినానికి సూచికగా 2007నుండి ఉనికిలో ఉంది. నీలిరంగు అన్నిదేశాలను ఐక్యంచేసే ఆకాశం రంగును, ఐక్యరాజ్యసమితి జెండా రంగు ను సూచిస్తుంది. వలయం ఆరోగ్యాన్ని సూచిస్తుంది. అంటే ప్రపంచ మధమేహ దినం లోగో నీలిరంగు వలయం ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్‌ను ఎదుర్కోవడంలో ప్రపంచదేశాల ఐక్యతను సూచిస్తుంది.


చక్కెర వ్యాధి... ఈ వ్యాధికి పేరులోనే చక్కెర... దాని ఫలితమంతా ఎంతో చేదు. ఆ వ్యాధి వస్తే చక్కెరకు ఇక దాదాపుగా దూరమైపోయినట్లే. ప్రపంచ మధుమేహ రాజధానిగా భారత్‌ మారిపోయింది. మధుమేహ సమస్య భారత్‌లో అత్యధికంగా ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో 15 కోట్ల మంది, దేశంలో 4 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు అంచనా. 2025 నాటికి భారత దేశంలో ఈ వ్యాధిపీడితుల సంఖ్య 7 కోట్లకు చేరుకోగలదని భావిస్తున్నారు. భారత్‌లోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఈ వ్యాధి మరింత అధికంగా ఉంది.

హైదరాబాద్‌ మధుమేహానికీ రాజధానిగా ఉంటోంది. మధుమేహం కారణంగా ప్రతీ నిమిషానికి ఆరుగురు మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 20 మరణాల్లో ఒకటి మధుమేహం కారణంగానే చోటు చేసుకుంటున్నది. మధుమేహం, సంబంధిత వ్యాధుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 32 లక్షల మంది మరణిస్తున్నారు. మధుమేహం ను నిశ్శబ్దహంతకిగా అభివర్ణిస్తారు. దీన్ని నివారించడం అంత తేలిక కానప్పటికీ, కొన్ని రకాల విధివిధానాలు పాటించడం ద్వారా దీన్ని సమర్థంగా ఎదుర్కోవచ్చు. నవంబర్‌ 14న ‘డయాబెటిక్‌ డే’ ను పురస్కరించుకొని మధుమేహంపై ప్రత్యేక కథనం...

-మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్యభాషలో ''డయాబెటిస్‌ మెల్లిటస్‌'' అని వ్యవహరిస్తారు. డయాబెటిస్‌ అని కూడా వ్యవహరితమయ్యే ఈ వ్యాధి, ఇన్సులిన్‌ హార్మోన్‌ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం, రక్తంలో అధిక గ్లూకోజ్‌ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మ త. అతిమూత్రం (పాలీయూరియా), దాహం ఎక్కువగా వేయడం (పాలీడిప్సియా), అతిగా ఆకలి వేయడము (పాలీ ఫేజియా), మంద గించిన చూపు, కారణం లేకుండా బరువు తగ్గడం, బద్ధకం దీని ముఖ్య లక్షణాలు. మధు మేహం లేదా చక్కెర వ్యాధిని సాధారణంగా రక్తంలో మితి మీరిన చక్కెర స్థాయిని బట్టి గుర్తిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం భారత దేశం, చైనా, అమెరికాలలో అత్యధికంగా ఈ వ్యాధి ప్రబలి ఉన్నది. ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించే మందులు లేవు. జీవితాంతం తగిన జాగ్రత్తలు తీసుకొన్నట్లయితే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం.

ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన డయాబెటిస్‌ మెల్లిటస్‌.. 3 రకాలు..
అన్ని రకాల మధుమేహాలకు మూల కారణం క్లోమ గ్రంధిలోని బీటా కణాలు పెరిగిన గ్లూకోస్‌ స్థాయిని అరికట్టడానికి సరిపడినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడమే. మొదటి రకం డయాబెటిస్‌ సాధారణంగా బీటా కణాలను మన శరీరం స్వయంగా నాశనం చేయడం (ఆటోఇమ్యూనిటీ) వల్ల కలుగుతుంది. రెండవ రకం డయాబెటిస్‌లో ఇన్సులిన్‌ నిరోధకత వస్తుంది. దీనివల్ల అధికంగా ఇన్సులిన్‌ కావలసి వస్తుంది, బీటా కణాలు ఈ డిమాండ్‌ తట్టుకోలేనప్పుడు డయాబెటిస్‌ కలుగుతుంది. జెస్టేషనల్‌ డయాబెటిస్‌ (గర్భిణుల్లో వచ్చే మధుమేహం) లో కూడా ఇన్సులిన్‌ నిరోధకత అగుపిస్తుంది.

జెస్టేషనల్‌ డయాబెటిస్‌ సర్వసాధారణంగా ప్రసవం తర్వాత తగ్గిపోతుంది. మొదటి రకం, రెండవ రకం మధుమేహాలు మాత్రం దీర్ఘకాలికంగా ఉంటాయి. 1921లో ఇన్సున్‌ అందుబాటులోకి రావడంతో అన్ని రకాలను నియంత్రించడం సాధ్యమయ్యింది. ఆహార అలవాట్ల మార్పు కూడా భాగమయినప్పటి కీ, ఇన్సులిన్‌ ఉత్పత్తి లేని మొదటి రకాన్ని నియంత్రించడానికి ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌ ఇవ్వ టం తప్పనిసరి మార్గం. రెండవ రకం ఆహార అలవాట్ల మార్పు, ఆంటీడయాబెటిక్‌ మందు ల వాడకం వల్ల, అప్పుడప్పుడు ఇన్సులిన్‌ వాడకం వల్ల నియంత్రించవచ్చు.

వ్యాధి లక్షణాలు...
మధుమేహం యొక్క లక్షణాలలో ’ప్రదాయిక త్రయంగా పాలీయూరియా (అతిగా మూత్రం రావడం), పాలీడిప్సియా (దాహం వేయడం), పాలీఫాజియా (అతిగా ఆకలి వేయడం) అను వాటిని చెప్పుతారు. మొదటి రకం డయాబెటిస్‌లో ఈ లక్షణాలు త్వరగా అగుపిస్తాయి (ముఖ్యంగా చిన్న పిల్లలలో). కానీ, రెండవ రకంలో మాత్రం వ్యాధి లక్షణా లు చాలా నెమ్మదిగా మొదలవుతాయి, ఒక్కో సారి ఈ లక్షణాలేమీ కనిపించకపోవచ్చు కూడా. మొదటి రకం డయాబెటిస్‌ వల్ల కొద్ది సమయంలోనే గుర్తించదగిన బరువు తగ్గడం (మామూలుగా తిన్నా, అతిగా తిన్నా కూడా), అలసట కలుగుతుంటాయి. ఒక్క బరువు తగ్గ డం తప్ప మిగతా అన్ని లక్షణాలు, సరిగా నియంత్రణలలో లేని రెండవ రకం డయా బెటిస్‌ రోగులలో కూడా కనిపిస్తాయి.

మూత్ర పిండాల సామర్థ్యాన్ని దాటి రక్తంలో గ్లుకోస్‌ నిలువలు పెరిగితే, ప్రాక్సిమల్‌ టుబ్యూల్‌ నుండి గ్లూకోస్‌ రీఅబ్సార్ప్షన్‌ సరిగా జరగదు, కొంత గ్లూకోస్‌ మూత్రంలో మిగిలిపోతుంది. దీనివల్ల మూత్రం యొక్క ద్రవాభిసరణ పీడనం పెరిగి నీటి రీఅబ్సార్ప్షన్‌ ఆగిపోతుంటుంది, దానివల్ల మూత్రవిసర్జన ఎక్కువవుతుంది (పాలీయూరియా). కోల్పోయిన నీటి శాతాన్ని రక్తంలో పునస్థాపించడానికి శరీర కణాలలోని నీరు రక్తంలో చేరుతుంది, దీని వల్ల దాహం పెరుగుతుంది. ఎక్కువ కాలం రక్తంలో అధిక గ్లూకోస్‌ నిలువలు ఉండడం వల్ల కంటి లెన్స్‌ లో గ్లూకోజ్  పేరుకుపోయి దృష్టి లోపాలను కలుగజేస్తుంది. చూపు మందగించడం అనేది మొదటి రకం డయాబెటిస్‌ ఉందేమో అనే అనుమానాన్ని లేవనెత్తడానికి ముఖ్య కారణం.

రోగుల్లో (ముఖ్యంగా టైప్‌ 1) డయాబెటిక్‌ కీటో అసిడోసిస్‌ కూడా ఉండే అవకాశాలున్నా యి. దీనివల్ల మెటబాలిజమ్‌ నియంత్రణ కోల్పోయి శ్వాశలో అసిటోన్‌ వాసన రావడం, శ్వాశవేగంగా పీల్చుకోవడం, కడుపులో నొప్పి మొదలగు లక్షణాలు అగుపిస్తాయి. ఈ పరిస్థి తి తీవ్రమైతే కోమా తద్వారా మరణం సంభ వించవచ్చు. అతి అరుదైనదైనా తీవ్రమైన టైప్‌ 2 లో కలిగే నాన్‌ కీటోటిక్‌ హైపర్‌ ఆస్మొలార్‌ కోమా శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం వల్ల కలుగుతుంది.

పాదాలు - జాగ్రత్తలు
చక్కెరవ్యాధి రోగుల్లో పాదాల సమస్యల వల్ల మరణించే వారి సంఖ్య ఎక్కువ. చాలా సంవ త్సరాలుగా పాదాల్లో రక్తప్రసరణ క్షీణించడం వలన, నరాల స్పర్శ తగ్గడం వల్ల గాయాలు ఏర్పడి, మానకపోవడం వల్ల పాదాలకు సమస్యలు ఏర్పడుతాయి. న్యూరోపతీ, ఉపరితల రక్తనాళాల వ్యాధి, ఇన్ఫెక్షన్‌ వలన చక్కెర వ్యాధిగ్రస్తుల్లో పాదాల సమస్య తలెత్తుతుంది. మధుమేహం ఉన్న వారు కాళ్ళను పరిశుభ్రం గా ఉంచుకోవాలి. గోరువెచ్చటి నీటితో సబ్బు తో శుభ్రంగా కడగాలి. తరచుగా పాదాలను పరీక్షించుకోవాలి. చర్మం చెడిపోయినా, ను నుపుదనం కోల్పోయినా, డాక్టరును సంప్ర దించాలి.

కాలి వేళ్ళ మధ్యన పగుళ్ళు, ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. గోళ్ళను పరీక్షించు కోవాలి. గోళ్ళను వెంట వెంట కత్తిరించు కోవాలి. గోళ్ళ చుట్టూ ఎర్రదనం కన్పించినా, వాపు అనిపించినా డాక్టర్‌ను సంప్రదించాలి. కాళ్ళు పొడిబారకుండా నూనె రాసుకోవాలి. కాళ్ళు చల్లగా అనిపించినప్పుడు నెమ్మదిగా మర్ధన చేసి, వేడి వచ్చేలా చేయాలి. నీటి బుడగలు, పుళ్ళు, పగుళ్ళు లాంటివి వస్తే వెంటనే తగిన చికిత్స చేయించుకోవాలి. తప్పనిసరి గా అనువైన పాదరక్షలను ధరించాలి.

రక్తంలో చక్కెర శాతం తక్కువగా ఉంటే...
రక్తంలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటే చక్కె ర వ్యాధి అని అంటారు. ఈ శాతం తక్కువగా ఉండడం కూడా ప్రమాదకరం. దీనిని హైపో గ్లైసీమియా అంటారు. దీన్ని అశ్రద్ధ చేస్తే చాలా ప్రమాదం.

శరీరంలో చక్కెర నిల్వలు తగ్గిపోవడానికి కారణాలు:
- ఆహారం సరిగా తీసుకోకపోవడం, ఉపవాసాలు చేయడం.
- అనారోగ్యంగా ఉన్నప్పుడు అవసరానికి మించి వ్యాయామం, శారీరక శ్రమ చేయడం.
- నొప్పి నివారణ మందులు విచక్షణారహితంగా తీసుకోవడం.
- ఇన్సులిన్‌, యాంటీ డయాబెటిక్‌ మందులు ఎక్కువ మోతాదులో తీసుకోవడం.
- అధికంగా మత్తు పానీయాలు తీసుకోవడం.

క్తంలో చక్కెర శాతం తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు:
-ఈ లక్షణాలు ప్రతీ మనిషికి మారుతుంటాయి. ఒకే మనిషిలో విభిన్న లక్షణాలు కనిపిస్తుంటాయి.
- అతి ఆకలి, అతి చెమట, మూర్ఛపోవడం, బలహీనత, ఎక్కువగా గుండె కొట్టుకోవడం
- పెదవులకు తిమ్మిరి పట్టడం.
- చూపు మసకబారడం.
- తలనొప్పి, చేసే పనిపై శ్రద్ధ లేకపోవడం.
- తికమక పడడం. అలసిపోవడం, బద్దకం మొదలైనవి.

ఈ స్థితి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
- నాలుగు పూటలా మితంగా ఆహారం తీసుకోవాలి. (ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం, రాత్రి భోజనం)
- కచ్చితమైన ఆహార సమయాలు పాటిస్తూ, సరైన సమయంలో మందులు వాడడం.

చక్కెర శాతం తగ్గినప్పుడు జాగ్రత్తలు
- ఈ పరిస్థితి కన్పించగానే రక్తంలోని చక్కెర నిల్వల స్థితి పెంచాలి. 3,4 చెంచా చక్కెర లేదా గ్లూకోజ్‌ తీసుకోవాలి
- వ్యాధిగ్రస్తులు ఎప్పుడూ కొంత చక్కెర లేదా గ్లూకోజ్‌ దగ్గర ఉంచుకోవాలి.
- అపస్మారక స్థితి వస్తే వెంటనే వైద్యశాలకు తరలించాలి.

చక్కెర వ్యాధిని అశ్రద్ధ చేస్తే వచ్చే ప్రమాదాలు అపస్మారక స్థితి (కోమా)..
ఈ వ్యాధి ఉన్న వారు కోమాలోకి వెళ్ళే అవ కాశం ఉంది. ఇది మామూలుగా రెండు రకాలు. మొదటిది రక్తంలో చక్కెర 400 మి. గ్రా. కన్నా ఎక్కువ కావడం, రెండవది 60 మి.గ్రా. తక్కువ కావడం.

చక్కెర శాతం 400 మి.గ్రా. కన్నా ఎక్కువ కావడం...
Fat_Man-దీనినే డయాబెటిక్‌ కీటో అసిడోసిస్‌ అని కూడా అంటారు. ఈ స్థితిలో ఎక్కువగా దా హం, నాలుక తడారిపోవడం, మత్తుగా ఉండడం, వాంతులు, పొత్తి కడుపునొప్పి, తలనొ ప్పి, తలతిరగడం, విపరీతమైన నీరసం, ఒళ్ళునొప్పులు లక్షణాలుగా ఉంటాయి. ఈ సమయంలో వెంటనే డాక్టర్‌ను సంప్రదించా లి. ఈ దశలో కూడా తాత్సారం చేస్తే మరణానికి దారి తీయవచ్చు.

రక్తంలో చక్కెర శాతం 60 మి.గ్రా కన్నా తగ్గడం...
దీన్నే లో - షుగర్‌ లేదా హైపోగ్లైసి మియా అంటారు. ఇలాంటప్పుడు చక్కెర, గ్లూకోజ్‌, తేనె, పండ్లరసం, తీపి లేదా పిండి పదార్థం వెంటనే తీసుకోవాలి.

రక్తనాళాలలో మార్పులు...
రక్తంలో చక్కెర శాతం పెరిగితే రక్తం చిక్కగా మారి కొంతకాలం తరువాత రక్తనాళాల రం ధ్రాలను చిన్నగా పూడ్చేస్తుంది. ఈ మార్పు ముఖ్యంగా మూత్రపిండాలకు (డయాబెటిక్‌ నెఫ్రోపతి), కళ్ళకు (డయాబెటిక్‌ రెటినోపతి), నరాలకు (డయాబెటిక్‌ న్యూరోపతి), గుండెకు (కరొనరి ఆర్టరీ త్రాంబోసిస్‌)కు సంబంధించిన రక్తనాళాలలో చోటు చేసుకుంటుంది. వీటి మూలంగా కాళ్ళవాపులు, కంటిచూపు తగ్గిపో వడం, తిమ్మిర్లు, అరికాళ్ళ మంటలు, కాళ్ళ గాయాలు మానకపోవడం, ఆయాసం వంటివి అనిపిస్తాయి. ఒకసారి ఈ మార్పులు చోటు చేసుకుంటే తిరిగి యథాస్థితికి రావడం కష్టం. అందుకనే మధుమేహం ఉన్నవారు రక్తం లోని చక్కెర శాతాన్ని క్రమం తప్పకుండా పరీక్ష చేసుకుంటూ అదుపులో ఉంచుకోవాలి.

వ్యాధి నిర్ధారణ
మధుమేహ వ్యాధిని రక్త, మూత్రపరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు.
రక్తపరీక్ష: సాధారణంగా రక్తంలో చక్కెర శాతం 80 నుంచి 140 మి.గ్రా వరకు ఉంటుంది. ఇంత కన్నా ఎక్కువ ఉంటే చక్కెర వ్యాధి ఉన్నట్లే. ఖాళీ కడుపుతో ఉన్న ప్పుడు చక్కెర శాతం 60 నుంచి 90 ఎంజీ / డీఎల్‌, తిన్న తరువాత 110 నుంచి 140 ఎంజీ / డీఎల్‌ ఉండాలి. ఇంతకన్నా ఎక్కు వ ఉంటే చక్కెర వ్యాధి ఉన్నట్లే. ఈ పరీక్ష ద్వారా కచ్చితంగా వ్యాధిని నిర్ధారించవచ్చు.
మూత్రపరీక్ష: సాధారణంగా మూత్రంలో చక్కెర ఉండదు. ఒక వేళ మూత్రంలో చక్కెర ఉంటే వ్యాధి ఉన్నట్లే.

తీసుకోవలసిన జాగ్రత్తలు
exercise- చక్కెరవ్యాధిగ్రస్తులు ఆ జబ్బు గురించి అవగాహన పెంచుకోవాలి. ఇతర రోగులతో కలిసి తమకు తెలిసిన విషయాలను మిగిలిన వారితో పంచుకోవాలి. పాదాలు, మూత్ర పిండాలు, గుండె, నరాలు మొదలైన అవయవాలపై ఈవ్యాధి ప్రభావం ఎలా ఉంటుందో వీరు తెలుసుకోవాలి.

* రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యా యామం చేయాలి. తద్వారా శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి.
* భోజనానికి అరగంట ముందు మాత్ర లు వేసుకోవాలి. వాటిని ప్రతిరోజూ సరియైన సమయంలోనే వేసుకోవాలి. సమయ పాలన లేకపోతే మందులు వేసుకుంటున్నా శరీరంలో ఒక అపసవ్య స్థితి ఏర్పడుతుంది.
* ప్రతి రోజూ ఒక నిర్ణీత సమయంలోనే భోజనం చేయాలి.
* ఇన్సులిన్‌ వేసుకోవడంలోనూ కాలనియమాన్ని పాటించాలి.
* మధుమేహంలో కాళ్లల్లో స్పర్శజ్ఞానం పోయిందన్న విషయం చాలాకాలం వరకు తెలియదు. అందుకే వారు ఏటా ఒకసారి పాదాల్లో స్పర్శ ఎలాఉందో తెలుసుకోవాలి. స్పర్శ లేకపోతే ప్రతి ఆరుమాసాలకు వీలైతే మూడు మాసాలకు ఒకసారి పరీక్ష చేయించాలి.

* పాదాల మీద చర్మం కందిపోవడం, గాయాలు, పుండ్లు, ఆనెలు ఏమైనా ఉన్నా యేమో గమనించాలి. డాక్టర్‌ సమక్షంలో అవసరమైన చికిత్స తీసుకోవాలి.
* గోళ్లు తీసే సమయంలో ఎక్కడా గాయం కాకుండా జాగ్రత్త వహించాలి. పాదాలను ప్రతి రోజూ గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి.
* ఇన్‌ఫెక్షన్లతో కాళ్లకు చీము పడితే చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలి. డాక్టర్‌ సలహాతో యాంటీబయాటిక్స్‌, అవసరమైతే ఇన్సులిన్‌ తీసుకోవాలి.
* అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ పరీక్షలు, అలాగే కళ్లు, కిడ్నీ పరీక్షలు కూడా డాక్టర్‌ సలహా మేరకు చేయించుకోవాలి.

* మధుమేహం ఉన్న వారికి మూత్ర పిం డాలు దెబ్బతినే అవకాశం ఉంది. దీనివల్ల మూత్రంలో ఆల్బుమిన్‌ అనే ప్రొటీన్‌ విసర్జిం చబడుతుంది. అంతిమంగా ఇది కిడ్నీ దెబ్బ తినడానికి దారి తీస్తుంది. అందుకే ప్రతి మూడు మాసాలకు, ఆరు మాసాలకు పరీక్ష చేసి మూత్రంలో ఆల్బుమిన్‌ ఉందా లేదా కనుగొనాలి.
* మధుమేహం ఉన్న వారిలో గుండె కండ రాలకు రక్తాన్ని తీసుకొనిపోయే కరొనరీ రక్త నాళాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది. అందుకే గుండె నొప్పి ఉన్నా లేకపోయినా ప్రతి ఏటా ఇసిజి, ట్రెడ్‌మిల్‌ పరీక్షలు చేయించుకోవడం అవసరం. అలాగే కొలెస్ట్రా ల్‌ పరిమాణాన్ని తెలిపే లిపిడ్‌ ప్రొఫైల్‌ పరీక్షలు చేయించాలి.
* ధాన్యాలు, పిండిపదార్థాలు తగ్గించి పీచు పదార్థాలు అధికంగా ఉండే కూరగా యలు ఎక్కువగా తీసుకోవాలి.

మానుకోవలసిన అలవాట్లు
* తీపి పదార్థాలు, ఐస్‌క్రీములు మానుకోవాలి. అతి పరిమితంగా తీసుకున్నప్పుడు అయితే, ఆరోజు మామూలుగా తీసుకునే ఆహార పదార్థాల మోతాదును బాగా తగ్గిం చాలి. అలాగే నూనె పదార్థాలు కూడా బాగా తగ్గించాలి.
* కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో శరీరంలో చక్కెర శాతం హఠాత్తుగా పెరిగిపోవచ్చు. అప్పుడు మాత్రలు ఆ స్థితిని అదుపు చేయలే కపోవచ్చు. అలాంటప్పుడు డాక్టర్‌ సూచిస్తే ఇన్సులిన్‌ తీసుకోవాలి. ఆ తరువాత చక్కెర అదుపులోకి వచ్చాక మళ్లీ మాత్రలకే పరిమితం కావచ్చు. ఒకసారి ఇన్సులిన్‌ తీసుకుంటే జీవితాంతం ఇన్సులిన్‌ తీసుకోవలసి వస్తుందన్నది  సరికాదు. ఆ కారణంగా ఇన్సులిన్‌ తీసుకోవడానికి వెనుకాడకూడదు.
* పాదరక్షలు లేకుండా నడవకూడదు.
* పొగతాగడం పూర్తిగా మానుకోవాలి.
* మానసిక ఒత్తిళ్లను తగ్గించుకోవాలి.
* కొలెస్ట్రాల్‌ అధికంగా ఉండే కొవ్వు ఉన్న మాంసం, గుడ్లు తినడం మానుకోవాలి.

-- డాక్టర్‌ అశోక్‌కుమార్‌--జనరల్‌ ఫిజీషియన్‌, డయాబెటిక్‌ స్పెషలిస్ట్‌, గ్లోబల్‌ హాస్పిటల్స్‌,-హైదరాబాద్‌ -



ఆయుర్వేదంలో విముక్తి--ayurvedic-for-diabetes
* చక్కెర వ్యాధిని అరికట్టడమనేది మందులు, జీవనశైలి, ప్రశాంత జీవనం లాంటి వాటి యొక్క కలయిక. ఆయుర్వేదంలో వాతజ, కఫజ, పిత్తజ శరీరధర్మాలతో దాదాపు 20 రకాల చక్కెర వ్యాధులను ప్రస్తావించారు. వీటిలో మూడు వంతుల చక్కెర వ్యాధులు తగ్గించడానికి వీలవుతుందని మాధవాచార్యులు పేర్కొన్నారు. అనువంశిక లక్షణాలు ఉన్న వారికి చికిత్స ద్వారా అప్పటి వరకే తగ్గుతుందని, జీవితకాలం మందులు వాడాల్సి ఉంటుందని తెలిపారు.

* భారతీయ ఆహారంలో తీపి, ఉప్పు, పులుపు, వగరు, చేదు, కారం లాంటి ఆరు రుచుల గురించి ప్రధానంగా పేర్కొన్నారు. ఆహారంలో తప్పని సరిగా ఆరు రుచులు ఉండాలన్నారు. చక్కెర వ్యాధిగ్రస్తులు కారం, వగరు, చేదు, రసాలు కలిగిన కూరగాయలు బాగా తీసుకోవలసి ఉంటుంది. శక్తిని ఇచ్చే అన్నం ఎక్కువగా తీసు కోకుండా, పొట్టు కలిగిన జొన్నరొట్టె, గోధుమ పుల్కాలు, సజ్జ రొట్టె తీసుకుంటే రక్తంలో చక్కెర శాతం పెరగకుండా ఉంటుంది.
* అలజడి, కోపం తగ్గించుకొని మానసిక ప్రశాంతత కలిగి ఉండాలి. యోగా, ధ్యానం, నడక లాంటివి చక్కెర వ్యాధి రాకుండా నిరోధిస్తాయి. ముఖ్యంగా 40 సంవత్సరాలు పైబడిన వారు ప్రివెంటివ్‌ పద్ధతులు పాటిస్తూ ప్రతీ 6 నెలలకోసారి రక్తపరీక్ష చేయించుకుంటూ, కొద్ది గా తేడా కనిపించినా, మందుల అవసరం లేకుండానే తగ్గించుకోవడం మంచిది.

* బిల్వపత్రం, నేరేడు ఫలాలు, కాకర విత్తనాలు, పొడపత్రి, కరక్కాయ, తిప్పతీగె, ఉసిరి, అశ్వగంధ సమానభాగాల్లో తీసుకొని పొడి చేసి భద్రపర్చుకోవాలి. రోజూ పొద్దున, సాయం త్రం ఒక టీ స్పూన్‌ చొప్పున తీసుకుంటే చక్కెర వ్యాధిని నియంత్రించుకోవడం, తగ్గించు కోవడం తేలికే.
* వేదకాలంలో మధుమేహ ప్రస్తావన ఉంది.ఆ కాలంలో మధుమేహాన్ని 'అశ్రవ' అనే పేరుతో గుర్తించారు.ఈ వ్యాధి ఎలా వస్తుంది వ్యాధి లక్షణాలు ఏమిటి అని చరక సంహిత, శుశ్ర వసంహిత, నాగభట్ట గ్రంథాలలో వివరించారు. క్రీస్తుశకానికి వెయ్యి సంవత్సరాల కిందటనే ఈ వ్యాధి వర్ణన ఉండడం విశేషం. యజ్ఞ సమయాలలో దేవతలకు సమర్పించే హవిస్సును భుజించడం వలన ఈవ్యాధి వచ్చినట్లు పేర్కొన్నారు.

దక్షప్రజాపతి చేసిన యజ్ఞంలో హవిస్సు భుజించడం వలన ఈ వ్యాధి వచ్చినట్లు ప్రస్తావన ఉంది. క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో అష్టాంగ హృదయ అనే గ్రంధంలో మధుమేహం అనే పదం వాడబడింది. తేనెను మధువు అని అంటారు కనుక ఈ వ్యాధిగ్రస్థుల మూత్రం తేనెరంగు ఉంటుందని దీనికి ఈ పేరు వచ్చిందని భావన. 1400 సంవత్సరాల క్రితమే ఈ వ్యాధిని పత్యం,ఔషధం,వ్యాయామంతో క్రమపరచవచ్చని పేర్కొన్నారు. దాదాపు ఇప్పటికీ అనుసరిస్తున్న విధానం అదే కావడం గమనార్హం.

  • ఆయుర్వేదంలో గుర్తించిన వ్యాధి కారక అలవాట్లు
- అతిగా పాలుతాగడం. పాల ఉత్పత్తులు భుజించడం.
- అతిగా చక్కెర ఉపయోగించడం. చక్కెర రసాలు తాగడం.
- కొత్తగా పండిన ధాన్యాలను వంటలలో వాడడం.
- తాజాగా చేసిన సురను (మధువును) సేవించడం.
- అతిగా నిద్ర పోవడం, శరీరశ్రమ కావలసినంత చేయకపోవడం.
- మానసిక ఆందోళన, భారీ కాయం, అహారపు అలవాట్లు.
- ముందుగా తిన్నది జీర్ణంకాకముందే తిరిగి భుజించడం.
- ఆకలి లేకున్నా ఆహారం తీసుకోవడం.
- అతిగా ఆహారం తీసుకోవడం.

డాక్టర్‌ బుక్కా మహేశ్‌ బాబు-ఆయుర్వేద వైద్యులు-హైదరాబాద్‌, సెల్‌:


  • హోమియో చికిత్స
హోమియోపతి వైద్యవిధానంతో చక్కెర వ్యా ధిని నియంత్రించవచ్చు. రోగ లక్షణాలతో పాటు రోగి ప్రత్యేక లక్షణాలను పరిగణన లోకి తీసుకొని హోమియోవైద్యులు మందు లు ఇస్తారు. ఈ మందులు వాడడంతో పా టు సాధారణంగా చక్కెర వ్యాధి నియంత్రణకు సూచించిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. హోమియోపతి వైద్య విధానం సారూప్య పద్ధతి ఆధారంగా రూపుదిద్దుకున్నది. ఈ వై ద్యాన్ని జర్మన్‌ శాస్తవ్రేత్త శామ్యూల్‌ హానిమన్‌  1796 లో కనిపెట్టారు. ఈ విధానంలో వ్యాధి ఆధారంగా గాకుండా వ్యక్తి లక్షణా లను పరిగణనలోకి తీసుకొని మందు నిర్ధారిస్తారు. కొన్ని సాధారణ హోమియోపతి మందులను కింద సూచించినా డాక్టర్‌ను సంప్రదించడం తప్పనిసరి.

1. సైజిజీయం జంబోలినమ్‌,
- అధిక దాహం, నీరసం.,
- అధిక మూత్రం,
- సాధారణ ఆహారం తీసుకున్నా కూడా శరీరం చిక్కిపోవడం,

2. అబ్రోమా అగస్టా--
- ఉదయం, రాత్రి వేళలో అధిక మూత్రం,
- గొంతు ఎండిపోవడం, అధిక దాహం,
- మూత్రవిసర్జన అయిన వెంటనే దాహం కలగడం,
- మూత్ర విసర్జన ఆపుకోలేకపోవడం,

3. సెఫలాండ్ర ఇండికా--
- భయం, పనిమీద ఆసక్తి లేకపోవడం, సున్నితమైన మనస్తత్వం,
- నీరసం, మూత్ర విసర్జన అయిన తరువాత కళ్ళు తిరగడం,
- అధిక దాహం, అధిక మూత్రం,
- శరీరమంతా మంటగా ఉండడం,
- జిమ్నీమా సిల్విస్ట్రా,
- లైంగిక సంబంధ సమస్యలు,
5. పాస్ఫారిక్‌ యాసిడ్‌,
- నీరసం, ఉత్సాహం లేకపోవడం, నిర్లక్ష్యంగా ఉండడం,
- నడిచినా లేదా నిలబడినా కళ్ళు తిరగడం,
- రాత్రివేళ అధికంగా మూత్రవిసర్జనకు వెళ్ళడం,
- మూత్ర విసర్జనకు ముందు ఆతృత, తరువాత మంటగా ఉండడం,
- రాత్రిపూట కాళ్ళనొప్పులు అధికమవడం,
- ఉదయం, రాత్రి వేళలో అధికంగా చెమట పట్టడం.

  • కళ్ళు- జాగ్రత్తలు
-మధుమేహవ్యాధి లక్షణాలు బయటపడక ముందే చాలా సందర్భాల్లో కళ్ళు దెబ్బతినడం గానీ, రోగగ్రస్తం కావడం కానీ జరుగు తుంది. కంటికి సంబంధించి ఏ బాధ కలిగి నా వెంటనే కంటిడాక్టర్‌ను సంప్రదించాలి. సంవత్సరానికి కనీసం రెండు సార్లు కంటి పరీక్ష చేయించుకోవాలి. మధుమేహం ఉన్నవారిలో సాధారణ కంటివ్యాధులు :- శుక్లాలు, గ్లకోమా (ద్రవాల పీడనం పెరగడం), రెటినోపతి (కంటి లోని నరాలు దెబ్బ తినడం).. వస్తాయి.
  • =================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

Friday, November 19, 2010

జాతీయ పత్రికా దినోత్సవం, National (India) press Day


  • ----https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgvoaiPUephrp0fRzMI89NBC7nIXH0H4Ji_inmMCMvaoRLUa0YPgvlpFrAfk82R9xus69D_UkqvE5mNUunULGBtqYIDpp_rpH6dpIY6Ytxda8z3EvMA7deOvy1JPUYBtbnwzGdFfaCOoKp2/s1600/Press+Day.jpg
  • జాతీయ పత్రికా దినోత్సవం --నవంబర్‌ 16
  • ఒక దేశము లో ప్రజాస్వామ్యము సక్రమముగా పనిచేస్తున్నదీ లేనిదీ తెలుసుకోవాలంటే ఆ దేశములో పత్రికా రంగాన్ని పరిశీలిస్తే చాలు . పత్రికా రంగము మీద ఎటువంటి ఆంక్షలు లేకుండా పత్రికా స్వాతంత్ర్యము అమలవుతుంటే ఆ దేశము లో ప్రజాస్వామ్యపాలనకు , చట్టబద్దపాలనకు ఢోకాలేనట్టే .
  • జాతీయ పత్రికా దినోత్సవం (నవంబర్‌ 16): అధికారంలో ఉన్న వ్యక్తుల చేత, వ్యవస్థల ఇష్టాయిష్టాల వల్ల ప్రభావితం కాకుండా శక్తిమంతమైన ప్రసారమాధ్యమంగా అత్యున్నత ప్రమాణాలను పాటించేలా చూడటం లక్ష్యంగా భారతదేశంలో నవంబర్‌ 16, 1966వ సంవత్సరంలో ‘ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా’ స్థాపించారు. ప్రతిసంత్సరం ఈ రోజున ‘నేషనల్‌ ప్రెస్‌ డే (జాతీయ పత్రికా దినోత్సవం)’గా జరుపుకుంటారు.

    పత్రికారంగంలో ఉన్నత ప్రమాణాలను పాటించేందుకు మనదేశంలో నవంబరు 16వ తేదీని జాతీయ పత్రికా దినంగా 1966 నుంచి పాటిస్తున్నారు. భారత తొలి ప్రెస్‌ కమిషన్‌ 1956లో సిఫార్సు మేరకు 1966 నవంబరు 16న ప్రెస్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. ప్రెస్‌ కౌన్సిల్‌ పత్రికారంగాన్ని పరిశీలించటంతో పాటు వార్తల తీరుతెన్నులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వృత్తిపరమైన అక్రమాలకు పాల్పడిన పత్రికలు, సంస్థల చర్యలను విమర్శించటం,అభిశంసించటం, చర్యలకు సిఫార్సు చేస్తుంది. పత్రికా స్వేచ్ఛకోసం పనిచేయాలన్నది లక్ష్యం. ప్రపంచంలో అనేక దేశాలలో ప్రెస్‌ కౌన్సిళ్లు ఉన్నాయి. అయితే మనదేశ కౌన్సిల్‌కు ఉన్న ప్రత్యేకతేమంటే ప్రభుత్వశాఖలపై కూడా తన అధికారాన్ని వినియోగించే అవకాశం కలిగి ఉంది. పత్రికలు, మీడియా స్వయంగా ఉన్నత ప్రమాణాలను నిర్ణయించుకొని అమలు జరిపే విధంగా ప్రెస్‌కౌన్సిల్‌ ప్రోత్సహిస్తుంది.

    గత పన్నెండు సంవత్సరాలుగా ప్రెస్‌ కౌన్సిల్‌ పత్రికా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యల గురించి ప్రతి నవంబరు 16న సెమినార్లు నిర్వహిస్తున్నది. ఈ ఏడాది హైదరాబాదులో మారుతున్న భారత మీడియా రూపురేఖలు అనే అంశంపై సెమినార్‌ నిర్వహిస్తున్నది.

    అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనలోని 19 ఆర్టికల్‌కు అనుగుణంగా పాలకులు పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, వారికి పత్రికా స్వేచ్ఛ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినంగా మే 3వ తేదీని ప్రకటించింది. ఈ సందర్భంగా పత్రికా స్వేచ్ఛకు విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్థలు, సంఘాలకు అవార్డులను అందచేస్తున్నది. పత్రికా స్వేఛ్చకు అనేక దేశాలలో ముప్పువచ్చిన తరుణంలో 1997లో ఈ అవార్డును ఏర్పాటు చేశారు.
For more details -> World Press freedom Day
  • ====================================- =
Visit My Website - > Dr.seshagirirao-MBBS

Monday, November 8, 2010

ప్రపంచ ఆస్టియోపోరొసిస్‌ దినం , World Osteporosis Day


  • https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjmrB44Xx8kcNm1jln9p_efoRAaQchxek24HC7RA33wL3CYp5tGkzzzyuA-big3EW6Kk4A1QTLJ2pq9iEChyphenhyphenGnK5uZ4gCJoaAumymMChssLTs51f1TDTMvwHXD3UTu2JIGHsr4_NqeSJeI2/s1600/Osteoporosis.jpg

పాత కణాలు అంతరించి కొత్త కణాలు అంకురించే ప్రక్రియ ఎముకల్లోనూ నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. ఏ కారణంగానైనా తరిగిపోతున్న పాత ఎముకకు సరిసమానంగా కొత్త ఎముక ఏర్పడకపోతే ఎముకలు పెళుసుబారిపోయి .... ఆస్టియో పొరోసిస్ వ్యాధి మొదలవుతుంది. ఎముకల్లోని ప్రోటీన్‌, మూలాధాతువైన కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్‌ వంటివి లోపించడం వల్ల ఇది జరుగు తూ ఉంటుంది .

కాల్షియం, ఇతర పోషకాలు విటమిన్‌- డి3, డి4 సహకారంతో ఎముకల్లోని చేరడాన్ని 'ఆస్టియో బ్లాస్టిక్‌ ప్రక్రియ' అంటాం. అలాగే ఎముకలో పాతబడిన కాల్షియం, ఇతర పోషకాలు బయటకు వెళ్లడాన్ని ఆస్టియో క్లాస్టిక్‌ ప్రక్రియ అంటాం. వీటి మధ్య ఏర్పడే అసమతుల్యత వల్ల ఎముక బలహీనపడడాన్ని ఆస్టియోపోరొసిస్‌ అంటారు. దీనివల్ల దీర్ఘకాలంలో ఆర్రైటీస్‌, స్పైన్‌ సమస్యలు, డిస్క్‌ సమస్యలు, ఎముకల నొప్పులు, ఫ్రాక్చర్‌ వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి. సహజంగా స్త్రీలలో 45 నుండి 45 ఏళ్లు, పురుషుల్లో 55 ఏళ్లుపైబడిన వారికి ఆస్టియోపొరోసిస్‌ వచ్చే అవకాశముంటుంది.

  • ==================================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

Thursday, November 4, 2010

మదర్-ఇన్‌-లా డే, అత్తla దినోత్సవం , Mother-in-law Day



  • ప్రతి సంవత్సరమూ అక్టోబర్ నెల నాలుగో ఆదివారము మదర్-ఇన్‌-లాస్ ... డే (అత్తల దినోత్సవం) జరుపుకుంటారు . ఈ ఉత్సవం జరుపుకోవడానికి ఖచ్చితమైన కారణము తెలియదు . గ్రీటింగ్ కార్డ్ కంపెనీలు బహుశా ప్రారంభించవచ్చును అని ఊహాగానాలు ఉన్నాయి . కారణము ఏదైనా ... అత్తగారి సాయానికి కృతజ్ఞతలు చెప్తూ కోడళ్ళు ఆమెకు బహుమతులు అందజేస్తూ ప్రేమ , ఆప్యాయతల్ని పంచే రోజు ఇది .
కమ్మని ప్రేమ అమ్మది అయితె ఆ అమ్మ తరువాత మరో అమ్మ ... అత్తమ్మ . జీవితమంతా తోడూ-నీడగా ఉండేందుకు బాసలు చేసి ఒకటైన ప్రతి జంటకు కన్న తల్లులిద్దరు ఆ ఇద్దరు దంపతులకు అత్తమ్మలే . అత్త కోడళ్ళ  కథనాలు అనేకచోట్ల సాగుతుంటాయి . దాదాపు అన్ని కథల్లోనూ ఎక్కడోచోట అత్తాకోడళ్ళ నడుమ స్పర్ధలు ఉంటునేఉంటాయి . యువతము " అమ్మో అత్తగారా!" అంటే నడుమతరము " అమ్మో కోడలుపిల్లా!" అంటుంటారు . ఎందుకీ అంతరము అని ప్రశ్నించుకుంటే ... కారణము ప్రేమే అని కనబడుతుంది .

కొడుక్కి పెళ్ళి చేసేంతవరకు తహతహలాడిన అమ్మ అత్తగారి హోదా రాగానే ఎందుకు రుసరుసలాడుతుందో తెలియక తలపట్టుకుంటారు కొందరు . కారణం చూడండి .... పుట్టింట ఎటువంటి అరమరిలకూ లేని కూతురు మెట్టినింట కోడలు పాత్రలోకి  వచ్చేసరికి ఏదో తెలియని అసంతృప్తితో ఎందుకు రగిలిపోతుందో ... అందుకు కారణము " ప్రేమే" . పెళ్ళి దాకా ప్రతి చిన్న అవసరానికీ అమ్మ అని పిలిస్తూ తనపై అనుక్షణము ఆధారపడిన కొడుకు పెళ్ళి తరువాత కోడలిని క్షణం క్షణం సదరు అవసరాలము పిలవడం ఆత్తకు ఎక్కడో అసంతృప్తి లేపుతుంది ...కొడుకు తనప్రేమకు దూరమతున్నాడేమోనని తన పాత్ర ప్రాముఖ్యత తగ్గిపోతుందేమో నని బయమే భయము తోకూడిన ప్రేమే. ఫలితం గా కొత్తగా వచ్చిన కోడలి తో చీటికీ మాటికి తప్పులు ఎంచుతూ తగవులు ప్రారంభం అవుతాయి .

చాలా ఇళ్ళలో భార్యాభర్తల నడుమ వచ్చేటువంటి మనస్పర్ధలకు ఆ ఇంట్లోని అత్తగారినే బాధ్యురాల్ని చేస్తుంటారు . బాల్యము నుండి అత్తగారిపట్ల జీర్ణించుకుపోయిన దురభిప్రాయాలే ఇందుకు కారణము . చివరకు కథలు కార్టూన్లలో అత్తా కోడళ్ళ నడుమ వైరాన్ని ఎత్తిచూపుతుంటారు . ఇటువంటి స్పర్ధలతో కుటుంబసభ్యుల నడుమ కోపతాపాలు , చిక్కకులు , ఫలితం గా ఒత్తిడికి లోనవడం తప్పడం లేదు . చాలా జంటలు అత్తగారితో కలిసి వుండేందుకు సైతం మొగ్గుచూపడం లేదు . భార్యాభర్తల విడాకులవరకు దారితీస్తూ ఉంటాయి . చిన్న చిన్న వషయాలకు అత్తా కోడళ్ళు ఎవరూ బూతద్దం  లో చూడకూడదు . కుటుంబ వ్యవస్థ చిన్నాబిన్నము అవకుండా ఉండేటట్లు చూడాలి . ఒకవేళ ఎక్కడైనా విభేదాలు తలలెత్తినా వీలయినంత వరకు సంయమనాన్ని కోల్పోకుండా ఉండాలి . చిన్న చిన్న విషయాల్ని పెద్దవి చేసుకుని , విచ్చిన్నధోరణిలో వ్యవహరించేకంటే అంతదాకా వెళ్ళకపోవడమే మంచిది .

కొన్నిసార్లు భరించలేనంత సాధింపులను ఎదుర్కొనే పరిష్థితులను చూస్తుంటాము . ఇటువంటపుడు ఇతరత్రా అందరికీ ఆమోదయోగ్యమయిన పరిష్కారాన్ని వెతుక్కోవాలి . ఒకే ఇంట్లో ఒకరి నొకరు ప్రతిక్షణము శత్రువుల్లా చూసుకునే బదులు పంతాలు విడిచిపెట్టి సర్దుకుపోవడం మంచిది . పెళ్ళయ్యాక అప్పటిదాకా తన కొంగుపట్టుకుని తిరిగిన కొడుక్కి అంతగా తనపై ఆధారపడాల్సిన పని లేదని ... జీవితాంతము తోడుకోసం చేయిపట్టిన భాగస్వామితో అతను మెలగాలని ఆ కన్నతల్లి గుర్తించాలి . తానా ఇంటికోడలు గా వచ్చినంతమాత్రాన భర్త పూర్తిగా తనకే ప్రాధాన్యత ఇవ్వాలని , స్వంతం కావాలని దేనికోసమూ అత్తగారిపై అస్సలు ఆధారపడకూడదని ఆ ఇంటికోడలు ఆలోచించకూడదు . అందరూ ఒక్కటే అన్న భావము ఉన్నప్పుడు ఏ సమస్యారాదు .
వీటినన్నింటినీ మననం చేసుకుంటు అత్తగారిలోని అమ్మతనాన్ని గౌరవిస్తూ అమ్మకోసం ఓ పండుగ జరుపుకున్నట్లే అత్తగారి కోసమూ ఓ పండుగ జరుపుకోవాలనే ఉద్దేశమే ... ఈ మదర్-ఇన్‌-లా డే.

అత్తగారి హోదా: కాపురానికి అడుగుపెట్టిన క్షణము నుండి పరోక్షము గానో , ప్రత్యక్షముగానో అత్తగారు కోడలి మీద పెత్తనము చెలాయిస్తుంది . అయితె కోడళ్ళుకు తెలియని మరో విషయము ఏమిటంటే ఆ పెత్తనము పెళ్ళికి ముందునుండే ప్రారంభమవుతుంది  , తాను కోరుకున్న అమ్మాయిని  పెద్దల ప్రమేయము  లేకుండా పెళ్ళిచేసుకునే అబ్బాయిల సంఖ్య 10 శాతానికి మించదు . మిగిలిన 90 శాతము  అబ్బాయిలు తమ భార్యల ఎంపికలో తల్లికి ప్రాధాన్యత నిస్తారు . తన కొడుక్కి ఎటువంటి భార్యకావాలో తనకే బాగా తెలుసుననుకొంటుందా తల్లి . దాని ఫలితము గా తాను ముద్రవేసిన అమ్మాయినే పరిణయమాడమంటుంది.  అబ్బాయిలు కూడా అమ్మ మనసును తప్పనుకోరు ... నాటి వరకూ తన అవసరాలను కనిపెట్టి చూసిన అమ్మ కన్న నిర్ణయం చేయగలిగినవారెవరుంటారని అనుకొంటారు.  అలా అమ్మల ప్రభావముతో అబ్బాయిలు ఉండడము , తన సంసారము తాను స్వతంత్రము గా తీర్చిదిద్దుకోవాలన్న భావన అమ్మాయీలలో పెరరగడము తో ... అత్తా కోడళ్ళ మధ్య సంబందాలలో ఘర్షణ మొదలవుతున్నది .

అమ్మ నుండి అత్తగా : - కొత్తకోడళ్ళు ముందుగా అర్ధము చేసుకోవాల్సింది తన భర్తకు  , అత్తకు మధ్య ఉన్న అనుబంధము గురించి. తల్లిగా ఆమె కొడ్కును పెంచిన తీరుమీద వివాహబంధ ... జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. ఇవే సంసారము ప్రారంభమైన తొలినాళ్ళలో జరిగే చిన్న చిన్న సంఘటనలకు , భార్యా భర్తల సంబంధాలను మెరుగుపరచడము లేదా దెబ్బతీయడము చేస్తుంటాయి . అబ్బాయిలకు తొలిగా పరిచయమయ్యే " అమ్మాయి" తల్లి. తాను ఎదుటవారితో ఎలా ప్రవర్తించాలో తల్లి నుండే నేర్చుకుంటాడు . బావోద్వేగాల ప్రదర్శన , అనురాగబంధాల నిర్మాణము , బుద్ధి , జ్ఞానము , నడవడిక అన్నీ తలీ ద్వారనే అర్ధము చేసుకొని నేర్చుకుంటాడు కొడుకు. ఆడ పిల్లలతో ఎలా ప్రవర్తించాలో తెల్సుకునే యత్నము తల్లిని చూసే నేర్చుకుంటాడు . తల్లి చాలామంది అబ్బాయిలకు అత్యుత్తమ స్త్రీ. తనకు రాబోయే భార్య అమ్మలా ఉండాలనుకునే అబ్బాయిలూ ఉన్నారు. అయితే వీరికి అర్ధము కానిది .... తల్లి పాత్ర , భార్యపాత్ర ... భిన్నమైనవని , ఆ రెండూ ఒకేలా వ్యవహరించవని .  వివాహమయ్యే వరకూ అబ్బాయిలకు అమ్మతోటిదే లోకము . అబ్బాయికి ఆహారము వడ్డించేది , ఇష్టమైనవి చేసి పెట్టేది , బట్టలు ఉతికి సిద్ధము చేసేది , డబ్బు విషయములో జాగ్రత్తవహించేదీ , అబ్బాయి ప్రవర్తనకు అర్ధాలు చెప్పేది , అబ్బాయి మూడ్ ను అర్ధముచేసుకొని మెలిగేది ... అమ్మే .  అయితే వివాహము అయిన తర్వాత కొత్తకోడళ్ని తనకొడుకు అవసరాల గురించి చెప్పి ఇక నీదే ఆ బాధ్యత అని చెప్పి తప్పుకోదు అత్త . ఫలితము గా భార్యనుండి తల్లి అందించినటువంటి సేవలు , సహకారాలు ఆశిస్తుంటాడు అబ్బాయి. ఇది భార్య అర్ధము చేసుకుంటే పరవాలేదు.

తగాదా వద్దు :-   మరో రకము తల్లులు అబ్బాయిలను తమ నోటితో అదుపులో పెట్టుకుంటారు . ప్రతి పనికీ కొడుకును విమర్శిస్తారు . అమ్మ నిర్దేశించే లక్ష్యాలను అందుకోవడమే అబ్బాయి జీవతమవుతుంది . తాను అనుకున్నది అబ్బాయి అందుకోలేక పోగానే అమ్మ దిగులుపడి కూర్చుంటుంది .. కన్నీరు పెట్టుకుంటుంది. ఆ స్థితిని అబ్బాయిలు చూడలేరు.అందుకని చాలామంది అమ్మను సంతోషపరచడమే లక్ష్యము గా పెట్టుకుంటారు . ఇటువంటి భర్తలు లభించిన అమ్మాయిలు తెలివిగా వ్యవహరించాలి. తమ విషయాలు తల్లికి చేరవేయనివ్వకుండా జాగ్రత్త పడాలి . అత్తగారిని పరోక్షముగానైనా .  విమర్శించకూడదు . తల్లిమీడ మాటపడే సరికి పూనకము వచ్చినట్లు ప్రవర్తిస్తారు అబ్బాయిలు.

భర్తతో చర్చిండి :-  భర్తకు తల్లిమీద ఉన్న అభిప్రాయము తొలగించాలనే యత్నము కన్నా ఆ అభిప్రాయముతో నేనే ఏకీభవించడము లేదన్న మాటతో సరిపెట్టుకోవాలి. తల్లిదండ్రుల విషయములో అనవసర్పు వాదనలు చెయ్యవద్దు . ఈ ఎత్తుగడ క్రమముగా ఫలిస్తుంది. తల్లిని విమర్శించడము లేదు కాబట్టి  భర్త కూడా తల్లి విషయము తీసుకు రావడము తగ్గిస్తాడు . క్రమముగా తల్లికి ప్రతీ విషయము చేరవేసే గుణము తగ్గుతుంది. కాని అత్తగార్లందరూ అంత సులభముగా వూరుకోరు .కొడుక్కి ఫోన్‌ చేసి మాట్లాడకపోతే  ఆ కోపము కోడలి మీదకు మళ్ళిస్తారు. ఏదో ఒక విధము గా కోడళిని రెచ్చగొట్టి , ఆ చిరాకులో కోడలు అన్న చిన్న మాటను ' భూతద్దములో' కొడిక్కి చూపిస్తారు . ఇందంటా కొడుకు తనకెక్కడ దూరం అవుతాడో అన్న మానసిక భయము వల్లే . తన చేతుల్లోనుండి కొడుకు జారిపోతాడేమో  అన్న అభద్రతా భావము మూలంగా ... వీలులేకుండా ,కొడుకుతో తనకున్న ప్రేమానుబంధాన్ని అడ్డుపెట్టుకొని ... ఎత్తుగడలు వేస్తూ కోడల్ని సుఖముగా సంసారము చేసుకోనివ్వదు. ఒకే అంశము మీద తరచుగా  భర్తతో తగాదా పడడము అనవసరము ..అది అత్తగారి విషయములో అస్సలు అనవసరము .

ఎవరి స్థానము లో వారు ఉంటే ఉత్తమము . అత్త పోరులేని సంసారమే ఏ కోడలైనా కోరుకునేది. అనవసరపు ' పోరు' ఉండకూడదనుకుంటారే గాని అసలు అత్తలే వద్దనే అమ్మాయిలు ఉండరు . అందుకు గాను అత్తలూ కొంతవరకు తనకు దూరము గా కొడుకు జారిపోతున్నాడెమో నన్న అభద్రగా భావనను విడిచి,  కోడల్ని కూతురు మాదిరిగా చూసుకోవాలి. అయితే ఇక్కడ  'మామ' పాత్ర ఏమీ లేదా అంటే ... ఉండకూడదనే చెప్పాలి.  కుటుంబ వ్యవస్థలో ఆడవారి పాత్రే ముఖ్యమైనది. మామయ్యలు కోడలు వచ్చే సరికి వయసు మళ్ళినవారు అవడము మూలంగానో , సంసార సారధ్యబడలిక మూలంగానో , అనారో్గ్యమూలంగానో ఈ అత్తా కోడళ్ళ నాటికలో మౌనం పాత్ర పోషిస్తూ కాలం గడిపేస్తుంటారు.

అత్త ఒకింటి కోడలే. కోడలూ కాబోయే అత్తే. అత్త కోడళ్ళ మధ్య మంచి అవగాహన ఉన్న కుటుంబం స్వర్గమే . ప్రతి తల్లి తమ కూతురు అత్తింటి వద్ద సుఖపడాలని కోరుకోవడం సహజం . అక్కడ పరిస్తితులకు అనుగుణంగా కాపురం ఉంటుంది . ప్రతి అత్త కూడా తమ కోడలు గునవంతురలుగా ఉండాలని ఆశిస్తుంది . అయితే కట్నం అనే జబ్బు లాంటి డబ్బుతో పాటు కొన్ని లాంచనాలు " అత్త కోడళ్ళ మధ్య విభేదాలు సృష్టి స్తున్నాయి " . వర్తమాన కాలంలో  ఉద్యోగాలు వలనో , పనికోసము వలసలు వెళ్ళడము మూలంగానో పెళ్లి అయిన వెంటనే వేరే కాపురాలు పెడుతున్నారు . ఇక అత్త కోడళ్ళ మధ్య సంబందాలే ఉండడం లేదు . కోడలి కూతిరి లాగ అత్త చూసుకోవడం ...అత్తను అమ్మలా చూసుకోవడం జరగడము లేదు.



  • ===================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS

Monday, November 1, 2010

అంతర్జాతీయ అంధుల ఆసరా దినోత్సవం, World Whitecane day



''ది రైట్‌ టు సైట్‌'' అనేది ఈసారి ప్రపంచ ప్రపంచ దృష్టి దినోత్సవ నినాదం. అంతే కదా మరి. మనకు కేవలం జీవించే హక్కు మాత్రమే కాదు, ఆనందంగా జీవించే హక్కు వుంది. అంధకారంలో సంతోషానికి తావెక్కడిది? పుచ్చపూవులాంటి కాంతిపుంజాలకు ఆస్కారమేది? ప్రపంచ ఆరోగ్య సంస్థ కంటి చూపు, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో ఆసక్తికరమైన ప్రదర్శనలు నిర్వహించబోతోంది. అలాగే విషన్‌ 2020ని మరింత ప్రచారం చేసేందుకు గాలా టూర్‌ను ఏర్పాటు చేస్తోంది. కంటి ప్రాముఖ్యత సామాన్యులకు కూడా తెలీడంకోసం ప్రముఖులచేత ప్రచారం చేయించడం కద్దు. అలాంటి ప్రకటనలు, ప్రోగ్రాములను జాతీయ, అంతర్జాతీయ టీవీ ఛానళ్ళలో ప్రసారమయ్యేలా చూస్తారు.

కంటి పరీక్షలు :
కంటికి సంబంధించిన సమక్ష్యలు ఏవైనా ఉండే వాటిని ముందే గుర్తిస్తే త్వరితం గా , సులువుగా చికిత్స చేయించుకునే అవకాశము ఉంటుంది . కంటిపరీక్షలు
20 సం. వయసు లో ఒకసారి ,
30 సం. వయసు లో రెండుసార్లు ,
గ్లకోమా , రెటీనా సమస్యలు వస్తాయి . వీటిని త్వరగా గుర్తిస్తే ... చికిత్స సులువవుతుంది .
40 సం. వయసు రాగానే ప్రతి రెండు నుంచి నాలుగేళ్ళకు ఒకసారి కంటిపరీక్షలు చేయించుకోవాలి .
65 ఏళ్ళు చేరేక ఏడాదికొకసారి పరీక్షలు అవసరము . ఈ పరీక్షలు ఏ సమస్యలు లేనప్పుడు సాధారణముగా చేయించుకోవాలి . సమస్య వచ్చినప్పుడు వెంటనే పరీక్షలు చేయించుకోవాలి . డయాబెటిస్ ఉన్నవాల్లూ , వంశపారంపర్యం గా కంటిసంబంధిత సమస్యలు గలవారు 40 సం. దాటాక తరచూ కంటి పరీక్షలు చేయించుకోవాలి .

for full details ->

World Sight Day , ప్రపంచ దృస్టి దినోత్సవం

  • -------------------------------------------------------
Visit My Website - > Dr.seshagirirao-MBBS

World Sight Day , ప్రపంచ దృస్టిదినోత్సవం




అంధత్వ సమస్యలపై ప్రజలకు జాగ్రుతపరిచే ఉద్దేశం తో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరము అక్టోబర్ రెండో గురువారము World Sight Day , ప్రపంచ దృస్తిదినోత్సవం నిర్వహించాలని నిర్ణయించినది . 1998 నుండీ ఈ దినం జరుపూ ఉన్నారు . 2010 సం.లో అక్టోబర్ 14 న జరుగును .

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అంటారు . కంటిచూపుతో ప్రపంచాన్ని చుట్టేయవచ్చు . కనుసన్నల్తో ఆ ప్రపంచం లో బతికేయవచ్చు . అదే చూపు లోపిస్తే అంతా అంధకారమే . జీవితం చీకటిమయం అయిపోతుంది . రంగుల ప్రపంచము సుదూరతీరాలకు వెళ్ళిపోతుంది . ఆ కటిక చీకటిలో ఆ తీరము ఎప్పటికీ అందకుండానే మిగిలిపోతుంది. అందుకే ఆ చూపును ఎప్పుడూ పదిలం గా కాపాడుకోవాలి .

అంధత్వము అంటే పూర్తిగా గాని పాక్షికం గా గాని చూడలేని స్థితి. కంటి చూపు (Vision) పోవడాన్ని గుడ్డితనం లేదా అంధత్వం (Blindness) అంటారు. ఇది నేత్ర సంబంధమైన లేదా నరాల సంబంధమైన కారణాల వలన కలుగవచ్చును.

అంతర్జాతీయ అంధుల ఆసరా దినోత్సవం (వరల్డ్‌ వైట్‌ కేన్‌ డే (అక్టోబర్‌ 15)): అంధులకు దారి చూపేది, ఆస రాగా నిలిచే ది తెల్లటి చేతికర్ర. ఈ తెల్లటి చేతికర్ర ను అంధత్వానికి సంకేతంగా గ్రహించి ఐక్య రాజ్య సమితి 1981 వ సంవత్స రంలో అక్టోబర్‌ 15 వ తేదీని ‘వరల్ట్‌ వైట్‌ కేన్‌ డే’గా గుర్తించింది

దృష్టి మాంద్యాన్ని కొలిచే వివిధ కొలమానాలు మరియు అంధత్వ నిర్వచనాలు అభివృద్ధి చేయబడ్డాయి." పూర్తి అంధత్వం (Total blindness) అనగా దృష్టి పుర్తిగా లోపించడం. దీనిని వైద్య పరిభాషలో "NLP" (No Light Perceptionan) అంటారు. వీరు కాంతి ఉన్నదీ లేనిదీ మరియు ఆ కాంతి ఏ దిక్కు నుండి వస్తున్నదీ మాత్రమే గుర్తించగలరు. సాధారణమైన అంధత్వం (Blindness) అనగా దృష్టి లోపం తీవ్రంగా ఉన్నప్పుడు మరియు ఇంకా కొంత చూపు మిగిలి వున్నప్పుడు ఉపయోగిస్తారు.

అంధులలో ఎవరికి ప్రత్యేకమైన సహాయం అవసరం అనే విషయం మీద వివిధ ప్రభుత్వ చట్టాలు క్లిష్టమైన నిర్వచనాలు తయారుచేశాయి. వీటిని చట్టపరమైన అంధత్వం (Legal blindness) అంటారు. ఉత్తర అమెరికా మరియు ఐరోపా దేశాలలో ఈ అంధత్వాన్ని సవరించిన దృష్టి తీవ్రత (visual acuity) (vision) 20/200 (6/60) లేదా అంతకంటే తక్కువగా ఉంటే చట్టపరంగా అంధునిగా భావిస్తారు. ఇంచుమించుగా 10 శాతం చట్టపరంగా అంధులుగా నిర్ణయించినవారికి ఏ మాత్రం దృష్టి ఉండదు. మిగిలిన వారికి కొంత చూపు మిగిలివుంటుంది. కొనిసార్లు 20/70 to 20/200 చూపును కూడా దృష్టి లోపం అంటారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) International Statistical Classification of Diseases, Injuries and Causes of Death ప్రకారం దృష్టి మాంద్యం (Low vision) అనగా సవరించిన దృష్టి తీవ్రత 6/18 కంటే తక్కువగా ఉండడం, కానీ 3/60 కంటే మెరుగ్గా ఉండడం. అంధత్వం (Blindness) అనగా దృష్టి తీవ్రత 3/60 కంటే తక్కువగా ఉండడం.

కొన్ని రంగుల మధ్య భేధాన్ని గుర్తించలేకపోవడాన్ని వర్ణ అంధత్వం లేదా వర్ణాంధత (Colour Blindness) అంటారు. రాత్రి సమయంలో విటమిన్ ఎ. లోపం మూలంగా కలిగే దృష్టి మాంద్యాన్ని రేచీకటి (Night Blindness) అంటారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ Magnitude and causes of visual impairment యొక్క అంచనాల ప్రకారం 2002 సంవత్సరంలొ ప్రపంచంలో సుమారు 161 మిలియన్ (సుమారు 2.6% జనాభా) మంది దృష్టి లోపాలతో బాధపడుతున్నారని వీరిలో 124 మిలియన్ (సుమారు 2%) మందిలో దృష్టి మాంద్యం ఉన్నట్లు మరియు 37 మిలియన్ (సుమారు 0.6%) మంది అంధులుగా ప్రకటించింది.
అంధత్వానికి కారణాలు : అంధత్వం చాలా కారణాల మూలంగా కలుగుతుంది:
  • 1. కంటి వ్యాధులు

దృష్టి మాంద్యం ఎక్కువగా వ్యాధులు మరియు పౌష్టికాహార లోపం మూలంగా కలుగుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అంధత్వం కలగడానికి ముఖ్యమైన కారణాలు:

* శుక్లాలు (Cataracts) (47.8%),
* గ్లకోమా (Glaucoma) (12.3%),
* యువియైటిస్ (Uveitis) (10.2%),
* (Age-related Macular Degeneration) (AMD) (8.7%),
* ట్రకోమా (Trachoma) (3.6%),
* కార్నియల్ తెలుపుదనము (Corneal opacity) (5.1%),
* మధుమేహం (Diabetic retinopathy) (4.8%) మరియు ఇతర కారణాలు.

అభివృద్ధి చెందుతున్న దేశాలలో అంధత్వానికి ఎక్కువగా నివారించగలిగే కారణాల మూలంగా కలుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అంధులలో వృద్ధులు ఎక్కువగా ఉన్నా కూడా పిల్లల్లో అంధత్వం పేద దేశాలలో ముఖ్యంగా కనిపిస్తుంది. అంచనావేసిన 40 మిలియన్ అంధులలో 70- 80 శాతం మందిలో సరైన వైద్యంతో దృష్టిని కొంత లేదా పూర్తిగా తిరిగి పొందవచ్చును. పాశ్చాత్యదేశాలలో కలిగే అంధత్వం వయోసంబంధమైన మాక్యులా లేదా రెటినా లోపాల వలన కలుగుతుంది. మరొక కారణం నెలలు నిండకుండా పుట్టే పిల్లలలో కలిగే రెటినోపతీ.

  • 2. కల్తీ సారా

అరుదుగా కొన్ని రకాల రసాయనిక పదార్ధాల మూలంగా అంధత్వం కలుగవచ్చును. కల్తీ సారా త్రాగడం ఒక మంచి ఉదాహరణ. మిథనాల్ (Methanol) ఇథనాల్ (Ethanol) తో ఖల్తీ చేయయడం ... ఇది త్రాగుబోతు శరీరంలో ఫార్మాల్డిహైడ్ (Formaldehyde) .. ఫార్మిక్ ఆమ్లం (Formic acid) గా విచ్ఛిన్నం చెంది వాటివలన అంధత్వం మొదలైన ఆరోగ్య సమస్యలు మరియు మరణం సంభవించవచ్చును. ఈ మిథనాల్ ఎక్కువగా కల్తీ చేయబడిన సారాలో ఉంటుంది.

అంతర్జాతీయ అంధుల ఆసరా దినోత్సవం, World Whitecane day

కంటి సమస్యల్లో శుక్లాలు (కాటరాక్ట్‌), ట్రాకోమా, రిఫ్రాక్టివ్‌ ఎర్రర్‌, లో-విషన్‌, గ్లాకోమా, డయాబెటిక్‌ రెటీనోపతీ మొదలైనవి ప్రధానమైనవి. కంటికి సంబంధించిన ఏ సమస్య అయినా అశ్రద్ధ చేస్తే ప్రమాదమని గుర్తించాలి. కంటిచూపు మందగించినా, కళ్ళనుండి నీరు కారుతున్నా, కళ్ళు ఎర్రబడినా, పుసులు కారుతున్నా, తలనొప్పి వస్తున్నా వెంటనే కంటి డాక్టరును సంప్రదించాలి. సొంత వైద్యాలతో సరిపెట్టకుండా మంచి ఐ స్పెషలిస్టును సంప్రదించడం శ్రేయస్కరం. దురదృష్టవశాత్తూ మసకవెల్తురులో, ప్రయాణాల్లో చదవకూడదు లాంటి అతి మామూలు, కనీస నియమాలను కూడా ఖాతరుచేయక కంటి సమస్యలను కొనితెచ్చుకునేవారున్నారు.

అంధత్వ లెక్కలను ఒకసారి పరిశీలిస్తే 50 ఏళ్ళ క్రితం ప్రపంచవ్యాప్తంగా నాలుగున్నర కోట్లమంది అంధులు. ప్రస్తుతం ప్రతి ఐదు సెకన్లకీ ప్రపంచంలో ఒక వ్యక్తికి చూపు పోతోందని, ప్రతి ఐదు నిమిషాలకి ఓ చిన్నారి చూపు కోల్పోతున్నదని అంచనా. అలాగే ఏటా దాదాపు డెబ్భయ్‌ లక్షలమంది అంధులుగా మారుతున్నట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. ప్రపంచంలో దాదాపు 32 కోట్లమంది అంధులు లేదా దృష్టిలోపాలతో బాధపడ్తున్నారు. వారిలో నాలుగున్నర కోట్లమంది గుడ్డివారు కాగా 27.5 కోట్లమందికి కంటి సమస్య. అవగాహన లేని కారణంగా చిన్నచిన్న ఇన్‌ఫెక్షన్లు కూడా అంధత్వాన్ని తెచ్చిపెడ్తున్నాయి. స్త్రీలకంటే పురుషులే కంటి జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటారని, అంధులలో రెండింట మూడువంతులు స్త్రీలు, పిల్లలే ఉన్నారని సర్వేలు తెలియజేస్తున్నాయి. వృద్ధాప్యం మీదపడినకొద్దీ కంటి సమస్యలు అధికమవడం సాధారణం. కాగా, జీవనశైలిలో వచ్చిన మార్పులు కూడా దృష్టిలోపాలకు కారణమౌతున్నాయి. 90 శాతం అంధులు పేద దేశాల్లో నివసిస్తున్నారు. నిజానికి అంధులలో దాదాపు 80 శాతం మందికి చూపు తెప్పించగలిగే అవకాశం వుంది. ఆర్థిక ఇబ్బంది కారణంగా అంధుల శ్రేయస్సు కుంటుపడుతోంది.

అంధులకోసం ప్రవేశపెట్టాల్సిన పథకాలగురించి, అలాగే నిరుపేదలకు సైతం కంటిచికిత్స చేయించాల్సిన అవసరంగురించి, ఆరోగ్యశాఖా మంత్రులు, ఇతర ప్రభుత్వ అధికారులను ప్రేరేపించడం కూడా ఈరోజు కర్తవ్యాల్లో ఒకటి. ఈ సందర్భంగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి కళ్ళు ఎంత ముఖ్యమో, వాటినెలా కాపాడుకోవాలో అనే అంశాలపై చర్చిస్తారు. మన చూపును కాపాడుకోవడంతోబాటు, పిల్లలు కంటికి సంబంధించిన అనారోగ్యాలతో పుట్టకుండా జాగ్రత్తతీసుకోమని హెచ్చరిస్తారు. స్కూలు, కాలేజి పిల్లలకు కంటిచూపుకు సంబంధించిన విషయాలపై వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారు. పుట్టుకతో అంధులై, జీవనపర్యంతం చీకటితో సావాసం చేస్తున్నవారిని దృష్టిలో వుంచుకుని దాన్ని నివారించే దిశగా ఆలోచిస్తున్నారు. 2020 నాటికి లోకంలో అంధత్వం అనేది లేకుండా చేయాలనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశయం. దీని ఆవస్యకతను నలుగురికీ చాటి, ఆ దిశగా అందరూ ప్రయత్నించాలని ప్రచారం చేస్తున్నారు.

''ది రైట్‌ టు సైట్‌'' అనేది ఈసారి ప్రపంచ ప్రపంచ దృష్టి దినోత్సవ నినాదం. అంతే కదా మరి. మనకు కేవలం జీవించే హక్కు మాత్రమే కాదు, ఆనందంగా జీవించే హక్కు వుంది. అంధకారంలో సంతోషానికి తావెక్కడిది? పుచ్చపూవులాంటి కాంతిపుంజాలకు ఆస్కారమేది? ప్రపంచ ఆరోగ్య సంస్థ కంటి చూపు, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో ఆసక్తికరమైన ప్రదర్శనలు నిర్వహించబోతోంది. అలాగే విషన్‌ 2020ని మరింత ప్రచారం చేసేందుకు గాలాటూర్‌ ను ఏర్పాటు చేస్తోంది. కంటి ప్రాముఖ్యత సామాన్యులకు కూడా తెలీడంకోసం ప్రముఖులచేత ప్రచారం చేయించడం కద్దు. అలాంటి ప్రకటనలు, ప్రోగ్రాములను జాతీయ, అంతర్జాతీయ టీవీ ఛానళ్ళలో ప్రసారమయ్యేలా చూస్తారు.

గుడ్డివారికి లేదా, దృష్టిలోపాలతో బాధపడ్తున్నవారికి వ్యక్తిగతంగా లేదా సంస్థపరంగా మీరేమైనా సాయం చేయదల్చుకుంటే విషన్‌ 2020 వెబ్‌సైట్‌ హోమ్‌ పేజ్‌ చూడండి. అలాగే కంటి డాక్టర్లు, మెడికల్‌ ఇన్‌స్టిట్యూషన్లు, ఐ డోనర్లు, ఇతరత్రా కళ్ళకు సంబంధించిన సంస్థలు కూడా సహాయం అందించదల్చుకుంటే కూడా ఈ సైట్‌ చూడొచ్చు. విషన్‌ 2020 వెబ్‌సైట్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్టుతో సహా కళ్ళకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రచురిస్తుంది.

మనిషి తల్చుకుంటే సాధ్యంకానిదేమీ లేదని ఎన్నోసార్లు రుజువైంది. ప్లేగు, మసూచి, కుష్టు లాంటి అనేక భయానక వ్యాధులు మచ్చుకైనా లేకుండా చేశాడు. ఇంకెన్నో నయం కావనుకున్న అనారోగ్యాలు నామరూపాల్లేకుండా పోయాయి. కొన్ని వేల జబ్బులతోబాటు టీబీ, క్యాన్సర్‌ లాంటి ప్రమాదకరమైన రోగాలకు మందు కనిపెట్టాడు. పోలియో దాదాపుగా అంతరించిందనే చెప్పాలి. తీవ్ర దృష్టిలోపాలను సర్జరీద్వారా సవరిస్తున్నారు. మరి పుట్టు గుడ్డితనం, లేదా తర్వాత ప్రాప్తించే అంధత్వాలు లేకుండా చేయడం ఎంతమాత్రం అసాధ్యం కాదు. ఎందరో కంటి నిపుణులు ఇప్పుడీ విషయంమీద గట్టిగా కృషిచేస్తున్నారు. కనుక, 'విషన్‌ 2020' ఆశయం నెరవేరుతుందని, అంధత్వం లేని వెలుగుల సమాజం వస్తుందని ఆశిద్దాం. ఇక చీకట్లు మాయమై, అమావాస్యనాడు కూడా చంద్రుడు కనిపిస్తాడు. అందరి కళ్ళూ పండు వెన్నెల్లా, మల్లెపూవుల్లా విరుస్తాయి, మెరుస్తాయి. చీకటి దు:ఖం లేకుండా అందరూ ఆనందంగా నవ్వుల జల్లులు కురిపించే రోజు ఇంకెంతో దూరంలో లేదు.

కంటి... సంరక్షణ

* ఎప్పుడూ కూడా నెంబరులేని కళ్ళజోళ్ళను ధరించకండి.
* చలువ అద్దాలు వాడేటప్పుడు అవి అల్ట్రావైలెట్‌ కిరణాలనుంచి కాపాడేవిధంగా ఉండాలి.
* వంటగదిలో పనిచేసేటప్పుడు లేదా ఇంటిని శుభ్రం చేసేటప్పుడు కంట్లో నలుసు పడినప్పుడు చేత్తో నలపడంకానీ, రుద్దడం గానీ చేయకూడదు. చేతికున్న మట్టి, ధూళికణాలు ,సూక్ష్మక్రిములు కంటిలోకి చేరి అలర్జీలేదా ఇన్‌ఫెక్షన్‌ను కలిగించే ప్రమాదముంది.
*వంట చేసేటప్పుడు , వేడి అవిరి కళ్ళకు తగిలినప్పుడు లేదా కూరగాయలు శుభ్రం చేసే సమయంలో ధుమ్ము పడితే వెంటనే చేతులు శుభ్రం చేసుకుని చేతి వేళ్ళతో నీటిని కళ్ళమీద చిలకరించి మెత్తని గుడ్డతో కళ్ళు తుడుచుకోవాలి.
* కళ్ళను రోజుకు వీలైనంత వరకు రెండుసార్లు కన్నా ఎక్కువ కడుగవద్దు.
* కళ్ళలో మంట ఏర్పడి ఎరుపెక్కినపుడు ఏదో తమకు తోచిన మందులు, చిట్కాలు వాడకుండా వెంటనే కంటి డాక్టరును సంప్రదించాలి.
* మీచూపు సరిగ్గా కనపడపోయినా దృష్టిలో ఏదైనా లోపం ఉన్నా డాక్టరు సలహాలేకుండా మీకంట్లో రోజ్‌ వాటర్‌ను వేయకండి.
* సంవత్సరంలో ఒక సారైనా తప్పని సరిగా పూర్తి కంటిపరీక్షలు జరిపించుకోండి.
* కంటికి సరిపడా నిద్ర, విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం.
* కంటికి ఆరోగ్యంతో పాటు అందం కూడా అవసరం
* కళ్ళు అందంగా కనపడాలంటే కొన్ని జాగ్రత్తలు మనం పాటించాలి.
* కంటి అందాన్ని పెంచేదుకు కంటి మేకప్‌ చాలా అవసరం. గుర్తింపు పొందిన కంపెనీ ప్రోడక్టులనే వాడాలి లేదంటే వేరే వాటి వల్ల కళ్ళు దెబ్బతినే అవకాశం ఉంది.
* కాటుక దిద్దిన కళ్ళ చూపు చాలా శృంగార భరితంగా ఉంటుంది. అయితే కాటుక పెట్టుకునేటప్పుడు చేతివేళ్ళు శుభ్రంగా లేకపోతే క్రిములు కంట్లోకి ప్రవేశించి లోపలిభాగాలు దెబ్బతినే ప్రమాదముంది. అందువల్ల చేతులను శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
* కనురెప్పల వెంట్రులకు నలుపు రంగుతో సింగారిస్తే కళ్ళు పెద్దవిగా చాలా అందంగా ఉంటుంది. కానీ వీటిని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
* కళ్ళకు మంచి షేప్‌ రావడం కోసం ఐ లైనర్‌ను వాడతారు .దీన్ని వాడేటప్పుడు కంట్లో చిన్న చుక్క కూడా పడకుండా ఉండేలా జాగ్రత్త పడాలి.
* కంటి మేకప్‌ అవసరం తీరిన తర్వాత తొలిగించేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే కళ్ళకు ప్రమాదం జరగవచ్చు. కొందరు మహిళలు మేకప్‌ తొలిగించడం కోసం దూదిని నీటిలో ముంచి శుభ్రం చేస్తుంటారు. ఇది సరైన పద్దతి కాదు.
*కంటి మేకప్‌ను తొలిగించడానికి ప్రత్యేకమైన ఆయిల్‌ను మాత్రమే ఉపయేగించాలి. లేక పోతే బేబీ ఆయిల్‌ వాడవచ్చు
  • ========================================
Visit My Website - > Dr.seshagirirao-MBBS